పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

అమెరికా సంయక్త రాష్ట్రములు



గించి దేశీయ మహాజన సభవా రపుడు సమావేశ మైయున్న అన్నపోలీసుకు పోయెను. వాషింగ్టను జీటమేమియు పుచ్చు క్సొలేదు. సైనికుల దుస్తులు యుద్ధసామాగ్రులు భోజన పదార్దములు మొదలగునవి కొనుటకుగాను తన స్వంతము సుండి' యుద్దకాలములో పదునాలుగు వేల నాలుగువందల డెబ్బదితొమ్మిది సవరనుల పదునెనిమిది షిల్లింగుల తొమ్మిది సెన్సులను పెట్టుబడి కూడ పెట్టెను. అమెరికా వారు జయము పొందనిచో ఈ పెట్టుబడి పెట్టిన సొమ్ము తిరిగి రానేరదనుట నిస్సంశయము.తన మాతృదేశ స్వాతంత్యమునకై తన మాన ప్రాణధనముల నర్పించిన ధీరుడు జారిపోషింగ్టను గాక మరియెవరు? డింబరు 19 వ తేదీన దేశీయసభా నమా వేశమును చేరి నాలుగు దినము తరువాత తన యుద్యోగ మును దేశీయ సభ నానికి త్యజించెను. దేశీయ మహాసభ వారు జార్జి వాషింగ్టనుకు కృతజ్ఞతా వందనముల సర్పించివి. ఆయన పెట్టుబట్టిన సొమ్మంతయు నిచ్చి వేసిరి.

స్వాతంత్ర
యుద్ధ వ్యయము.


ఈస్వాతంత్ర యుద్ధములో అమెరికా వారికి మూడుకోట్ల డెబ్బది లక్షల సవరనుల ద్రవ్యము ఖర్చగుట యే గాక తొంబది లక్షల సవరనులు అరాసు దేశమునౌ ఋణపడిరి. ఎంతఖర్చయినను తాము భగవదను,గ్రహమువలన స్వాతంత్యమును పొందితి మను ఆనందమును పొందిరి. ఆంగ్లేయులకు పదునాలుగు కోట్ల సవరనులసొమ్ము ఖర్చయ్యెను. స్వదేశములోనే పోరాడ కలసిన వారగుటచే ఆమెకనులకు తక్కువ ఖర్చును, పదునారు వందల మైళ్ళ దూరము నుండి నేనలను తెచ్చి తమకెట్టిసానుభూ P