పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

193


చాలవరకు సేనలను తీసివేసిరి. రాజభక్తులలో చాలమంది పక్కనున్న ఆంగ్లేయ రాజ్యమగు కనడా దేశములోనికి వలన పోయిరి. తక్కినవారు దేశభక్తులుగా మారి తోడి దేశీయులతో గలసి మెలసి నెమ్మదిగ నివంసిచిరి. ఇరుపక్షముల వారును యుద్ధములో పట్టుకొనిన ఖయిదీల సందరలు విడుదలచేసి యిండ్లకు పఁపివేసిరి. రాజకీయ నేరముల చేసిన వారందరును క్షమాపణ నొసంగిరి అమెరికా రాష్ట్రము లన్నిటిలోను పండుగలు ఉత్సవములు వేడుకలు మిగుల సంరంభమతో సలిపిరి

వాషింగ్టను
సైనికులవద్ద శెలవు
పుచ్చుకొనుట.

డిశంబకు 4 వ తేదీన వాషింగ్టను న్యూయార్కు పట్టణమున తన సేనాను వద్దను నిల్చి యున్న సైనికులవద్దను శెలవు పుచ్చుకొనెను, ప్రేమ పూతమైన హృదయములో వాషింగ్టను తన కృతజ ను వెల్లడి.. గడచిన దినములు ఘనతను కీర్తిని సుపావంచినటులే వారికి రానున్న దినములు సౌఖ్యానహముగను మంగళకరముగను నుండునుగాక యని పరమేశ్వరుని ప్రార్థించెను. అందరును తమ బలహీనమగు ప్రయత్నముల నాశీర్వదించి జయము సమకూర్చిరి మనకు ధర్మస్వరూపుడగు భగవంతునికి హృదయ పూర్వక వందన ముల నర్పించిరి.. ఆనందముతోను ప్రేమతోను కూడుకొనిన బాష్పములు కనులనుండి రాల పోషింగ్టను సమావేశమునకు వచ్చిన ప్రతి వారినుండియు శేలవు గైకొనెను. అచటనుండి న్యూజర్సిమీదుగా ఫిలడల్ఫియాకు బోయి యచట దేశీయ మహాసభ వారి కోశాధికారికి తన ఓమా ఖర్చు లేఖను వప్ప'