పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అమెరికా సంయుక్త రాష్ట్రములు.

రెండవ అధ్యాయము.


అమెరికాను యూరఫుజాతు లాక్రమించుట.

యూరపియనులు
అమెరికాను
కనుగొనుట

1458 వ సంవత్సరమున కాన్ స్టాంటినోపిలు తురుష్కుల వశమయ్యేను. బాల్కనురాష్ట్రములన్నియు యూరపియనులు వీరి రాజ్యములో చేరెను. ఈజిప్టు దేశముకూడ వీరికిందికి వచ్చెను. ఆఫ్రికా ఖండముయొక్క యుత్తరభాగమును యూరపు ఖండము యొక్క తూర్పుభాగమును తురుష్కుల వశమందుండుటయు మహమ్మదీయులగు తుకుష్కులకును క్రైస్తవులగు యూరపు జాతులవారికిని బద్ధ ద్వేషము కలిగియుండుటయ, యూరపు జాతులవారదివరకు ఆసియా ఖండములోని హిందూదేశము, చైనా, జపాను దేశములతో చేయుచున్న వాణిజ్యమున కాటం కమును కలుగచేసెను. ఇదివరకు ఆసియాఖండపు వర్తకమునకదే త్రోవగ నుండెను. ఇపుడు త్రోవలో తురుష్క సుల్తాను