పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

అమెరికా సంయుక్త రాష్ట్రములు


కొనిరి. పరాసు, స్పెయి" నాగదళములను ఆంగ్ల నాకా సేనాని యోడించెను.


ఈలోపున పారిసువట్టణములో అమెరికా వారితో వృరుగను వరానువారితో వేరుగను సంధి ప్రయత్నములు జరుగు చుండెను. బెజమీను ఫ్రాన్కులిను కొంతకాలము ఒంటరి గను తరువాత 'జేయి, ఆడమ్సు అనువా రమెరికానుండి వచ్చి తోడ్పడియు సమెరికా తరఫున సంధి యద్యమమును సాగించు చుండెను. పెన్ని సిల్వానియా, మేరీలాండు, డెల వేరు, స్యూ యార్కురాష్ట్ర ములలోని రాజభక్తులు సంధి చేసుకొనవల దనియు తాము దేశీయ మహాజవ సభను నాశనము చేతుమునియు, సొంగ్లేయ ప్రభుత్వమువారికి మహజరులు బంపిరి. అక్టో బరు నెలలో " సేనలు చాల యిబ్బంది పడుచున్నవి, సంధి త్వరలో జరిగిన మంచిది. ” అని వాషింగ్టను వ్రాసెను. పరాసు ప్రభుత్వము వారికి తెలియకుండ సంధీని కుదుర్చుకోమని అమెరికా వారు వాగ్దత్తము చేసియున్నప్పటికీని తుదకు పరాసు వారికి తెలియకుండగనే అమెరికాప్రతినిధులు చిత్తు సంధి షర తులపై సంతకములుచేసిరి. అది పరాసుపోరిని అమెరికా వారు మరియొక ఋణ మిమ్మని కోరుచున్న సమయము. తమకు తెలియ కుండ సంధి చేసుకొనుట న్యాయము కాదని పరాసుమంత్రులు చెప్పిరి. బెంజమీను , ఫాస్కులిను క్షమాపణగోరెను. పరా సువారు మిగుల నౌదార్యమును చూపిరి. అరువదిలక్షల లివరీల ఋణమునిచ్చుట కంగీకరించి వెంటనే యారులక్షల లివరీలను చెల్లించి వేసిరి. స్పెయిన్ వారుకూడ ద్రవ్యము లేక