పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

అమెరికా సంయుక్త రాష్ట్రములు


చేరెను. దేశీయ మహాజన సభాధ్యక్షుని యింటికి పోయి బిగ్గరగా తలుపు తట్టెను. ద్వారపాలకు డీ సంగతి విని అత్య ధిక సంతోషముతో సధ్యక్షుని లేపెను. ఆరాతి ఫిలడల్ఫి యాపురములో జరిగిన గోలాహలము వర్ణనాతీతము, నేరములు చేసిన సైనికుల కందరకును వాషింగ్టను క్షమా వణ నొసంగెను. సైన్యములు భగవదారాధనను సలిపెను . సేనాధిపనులకు వందనము లర్పించబడెను. పరాసువారికి కృతజ్ఞత వెల్లడించబడెను. ఈ జయము యొక్క స్మారక చిహ్నము యార్కుటౌనులో నొక చలువరాతి స్తంభము ప్రతిష్టించబడెను. దేశీయ మహాజన సభవారు వాషింగ్లను సేనానికి రెండు పతాకములును రోషంబో సీనా:నికి రెండు తుపాకులును బహుమానమఁగ నిచ్చిరి.


ఆంగ్లేయ
పార్లమెంటులో
చర్చ.


ఈ వార్త నవంబరు 27వ తేదీన నాంగ్లేయ దేశములోచేరెను. ప్రధానమంత్రి నార్తుప్రభువు ఆంగ్లేయ పార్లమెం గుండెలో గుండు దెబ్బ తగిలినట్లుకూలబడెను. భగవంతుడా! అంతయు ముగిసినది" అని కేక వేసెను. కాని కొలది రోజులలో పార్లమెంటు సమా వేశమయినపుడు, అమెరికాను తన రాజ్యములో నుంచుకొనుటకు నిశ్చయించితి ననియు తన సేవలు చూపుచున్న పరాక్ర మమువలన తన రాజ్యములలో శాంతి నెలకొలుపబడుచున్న చనియు రాజు తన యుపన్యాసములో చెప్పెను. , ప్రభువుల సభలోను ప్రజాప్రపతినిధి సభలోను కొందరు సభ్యులు రాజు గారి యుపన్యాసమును ఖండించిరి. రాజుగారి యుపన్యాసము వలన " రాజ్యకాంక్ష తనివితీరనిది, " నాక్రోధముచల్లా