పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

173

ఎనిమిదవ ఆధ్యాయము


యులుకూడ సృష్టించి మోసము చేయసాగిరి. ఇందువలన ప్రజలకీ కాగితవు నోట్లయందు పూర్తిగా విశ్వాసము పోయినది. విదేశము నుండి సొమ్మరానిది. ఏమిచేయుటకును వీలు లేదని వాషింగ్టను గట్టిగ వ్రాయుచుండెను. 1781 సంవత్సరము జనవరి 1 వ తేదీన పెన్నీసి ల్వేనియా రాష్ట్రము నుండి వచ్చిన సైనికులలో చాలభాగము తిరు బాటు చేసి వెళ్ళిపో యెదమసిరి. వారిని పోడుండ చేయుటకు ప్రయత్నించగ నొక యుద్యోగస్తుడు చంపబడెను. పదమూమువందల సేనికులా యుద్ధములతో వెడలిపోయిరి. కాని వారు దేశద్రోహులు గారు. ఆంగ్లేయులు వారిని తమపక్షమున చేరమని కోరగా వారు నిరాకరించిరి. దేశీయ మహాజన సభవారు. వారితో నెటులనో రాజీపడి కొందరిని యిండ్లకు పంపి వేసి కొందరిని నేనలలో చేర్చుకొనిరి. జనేవరి 20 వ తేదీన న్యూజర్సీ రాష్ట్రమునుండి వచ్చిన సైనికులు తిరుగ బాటు చేసిరి. ఐదుగురు ముఖ్యులను వాషింగ్టను ఉరితీయించెను. ఇట్టి సందర్బమువలన కొత్తవారు సేనలలో చేరుట లేదు. కొన్ని రాష్ట్రములలో మాత్రము కొద్ది కాలమువరకు సేనలలోనుండు షరతుతో సైనికులు చేరుచుండిరి. దేశీయ మహాజనసభ వారు కావలెనని తీర్మానించిన ముప్పదియేడు వేల సైనికులను ఏడువేల మంది మాత్రమే యుండిరి. భోజనసామాగులు దొరకక సైనికులు చుట్టుపట్టు ప్రజలను నిర్బంధించి "తెచ్చు కొనుట జరుగుచుండెను. ఇటుల చేయుటవలన ప్రజలకిబ్బంది కలిగించుటయు సైనికులకు దురభ్యాసములు నేర్పుటయు ప్రజల