పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

అమెరికాసంయుక్త రాష్ట్రములు


హాలెండుతో యుద్ధము బాగుగ ప్రచురించకమునుపే హాలెండువారి యూస్టేషియను ద్వీపమును "ఆంగ్లేయ నౌ సేనాని యాకస్మికముగా ముట్టడించి యందు లోని హాలెండువారి ము ప్పదిలక్షల సవరసుల కిమ్మతుగల వర్తక సరుకును నూటయే బది వర్తకపు పడవలను అయిదు చిన్న యుద్ధనౌకలను స్వాధీనమును పొందెను. ఇతేగాక యూరోపునకు వచ్చుచున్న నలుబదియేడు హాలెండువర్తకవు నౌకలనుకూడ నాంగ్లేయులు సముద్రమధ్యమునందు పట్టుకొనిరి. మార్చి నెలలో పశ్చిమ యిండియా ద్వీపములలోని హాలెండువారికి చెందిన డెమరారా "మొదలగు ద్వీపముల ఇంగ్లేయు లాక్రమించుకొనిరి. ఉత్తర అమెరిశా తీరమున నాంగ్లేయుల పెన్సజోలా ద్వీపమును స్పైన్ వారు వశపరచుకొనిరి. '

అమెరికను
సైనికుల కష్ట
పరంపరలు.

పరాసు దేశపు ఆర్థిక స్థితి మిగుల చెడుగ నుండెను.పరాసు ప్రభుత్వము పదునారు కోట్ల సవరను వరకు ఋణపడియుండిరి. దీనిని తీర్చుమార్గ మెద్దియును లేకుండెను. అమెరికాకు సాయము చేయుటకుగాను హాలెండులో పరాసువారు ఒక కోటి లివరీల బుణమును చేసిరి. కొన్ని సంస్కరణములను చేయయత్నించి సాగక పరాసుమంత్రి నెక్కరు రాజీనామా నిచ్చెను. అమెరికాలో కూడ నింకను స్థితిగతులు వృద్ధి చెంద లేదు. 1780డిశంబరు నెలలోను 1781 సంవత్స:ము జనవరి నెలలోను మిక్కుటమగు చలికాల మగుటచే అమెరికను సేనలు పడిన కష్టములు వర్ణనాతీతములు. సైనికులకు పది నెలల జీతము బాకీ బడినది. అమెరికను కాగితపు నోట్లవంటివాటిని ఆంగ్లే