పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

అమెరికా సంయుక్త రాష్ట్రములు

ఇంగ్లాండు యొక్క, పాలనముకింద నుండెను. అపుడు తూర్పు సముద్రతీరమున పదమూడు రాష్ట్రములు మాత్రముండెను. తక్కిన ప్రదేశమంతయు నప్పటికి ఎర్రజాతుల యధీనమందుండెను. 1775 వ సంత్సరమున ఆంగ్లేయ ప్రభుత్వమువారు వేసిన యధిక పన్ను ల నిచ్చుటకు నిరాకరించి యాపదమూడు రాష్ట్రము లవారును ఆంగ్లేయ ప్రభుత్వము పై తిరుగుబాటుచేసిరి. ఆంగ్లేయ ప్రభుత్వమువారు యుద్ధమునకు రాగ వలస రాష్ట్రముల వారు వారినోడించి స్వాతంత్ర్యమును పొంది, అమెరికా సంయుక్త రాష్ట్రములకు రాజులేని సంయుక్తప్రజాస్వామ్యము నేర్పరచుకొనిరి. అప్పటినుండియు తెల్లవారు పడమటి సముద్రమువరకును గల యావత్తు దేశమును స్వాధీనమును పొంది 52 రాష్ట్రములుగ చేసికొనియున్నారు. వీరిని సాధారణముగ మనము అమెరికా వారని చెప్పుదుము.

(2)

అమెరికా యొక్క స్వతంత్రముకొరకై జరిగిన ఈ యుద్ధము చరిత్రలో చాల ప్రాముఖ్యమయినది. నవీన ఆమెరికా స్వతంత్ర కాలమున మాతృదేశముమీద వలసరాజ్యము తిరుగబడి స్వతంత్ర్యమును పొందుటకిదే ప్రధమ నిదర్శనము. ఈ మార్గమునే యనుసరించి పరాసు దేశముపైనను, స్పైన్ దేశము పైనసు వాటి క్రింద నుండిన అమెరికాలోని వలసరాజ్యములు తిరుగబాటు చేసి స్వతంత్ర ప్రభుత్వముల నేర్పరచుకున్నవి.


మెక్సికోలోను, పెరూలోను, స్వతంత్రముగనుండిన గొప్ప ఎర్రయిండియసు రాజ్యములు "తెల్లజాతులచే నాశనము