పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170 ...

అమెరికా సంయుక, రాష్ట్రములు


కింగ్సుకొండవద్ద
అమెరికనుల
జయమొందిరి.

కింగ్సుకొండద్ద కొంతవరకు జయముకలుగుచున్నది. ఆంగ్లేయ సేనానియగు కారన్ వాలీసు ప్రభువు ఆమెరికను ప్రజలను తన "సైన్యములలో చేరనునియు, తమ కాహారసామాగ్రుల నిమ్మని, నిర్బంధించుటయు, దేశభక్తుల ఆస్తులను వశపరచుకొనుటయు, ఆంగ్లేయు సైని కులు ప్రజలను దోచుకొనుటయ, హింసించుటయు, పట్టణములను తగుల బెట్టుటయు, చాలమంది అమెరిక నులలో నింగ్లీషు వారి పై ద్వేషమును పురిగొల్పుచుండెను. ప్రజలు సాయుధులై జేమ్సు విలియమ్సు, మారియనుల కింద ఐచ్చిక సైనికులుగ తయారుచేయబడిరి. ఆంగ్లేయులపై యాక స్మికముగ బడుచు పెద్ద సేనలు వచ్చి యదిరించినపుడు తప్పించుకొని పోవుచుండిరి. " ఉత్తరకారొలీనాలోని వీడీ, నాంటి నదుల మధ్యనున్న ప్రదేశము " నాంగ్లేయులపై యుద్ధము చేయుటకు సిద్ధపడని వాడొక 'డైన లేడని కారన్ వాలీసు వ్రాసెను. ఉత్తర కారొలీనా రాష్ట్ర మంతయు నీవిధముననే యుండెను. రాజభ క్తులనుండి కొంత తనకు సహాయము కలుగునని చూశించి కారాన్ వాలీసుప్రభువు ఉత్తర కారొలేనా పై డండయాత నలిపెను. 'మీజరుఫర్గూసను క్రింద కొంత సైన్య మును మిట్టపదేశములకు బంపి తాను మిగిలిన నేనలతో చెర్లెటి మీదికి వెడలెను గానీ త్రోవలో మేజరు ఫర్డూసను గొప్ప యపజయమును పొందెనను వార్తచేరెను. కింగ్సుకొండ వద్ద మేజరు ఫర్గూసను కింది నేనలను అమెరికనులు తార్కొని పూర్తిగా నోడించిన. మేజరు ఫర్గూసను హతుడయ్యెను. ఆంగ్లేయ సైనికులు మరణించిన వారుగా మిగిలినవారినందరను