పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

169



వచ్చెను. గేట్సు సేనాని ఈఅమెరికను సైన్యములన్నిటికిని. నేనాధిపత్యము వహించి పదునారవ యాగస్టున శాండన్ వద్ద కారన్ పొలీసు ప్రభువు కిందనుండిన యాంగ్లేయ సైన్యములను తార్కొనెను, కాని యీదిన మమెరికనులకు మిగుల దురదృష్టమైనది. వర్జీనియా నుండి వచ్చిన యైచ్బికభటు లాయుధములను పార వేసి ఆంగ్లేయులు వెంబడించినను చిక్కక సమీపముననున్న అడవులలోనికి పారిపోయిరి, చాలమంది ఇతర సైనికులును నదేపనిని చేసిరి. మొతముమీద అమెరికను సైన్యములలో రెండు భాగము లొక తుపాకియైన శత్రువులమీద కాల్చకుండగనే సత్వంత భయమువలన పలాయన మైరి. అమెరికను సేనాని డిక్నాలుసకు బలమైనగాయములు. తగిలి మరణించెను. యుద్ధమునకు నిలువబడిన అమెరికను సైనికులలో రెండు వేల మంది హతులైరి. అమెరికను సామాగ్రులును యుద్ధసామానులును ఆంగ్లేయులు స్వాధీనము పొందిరి. మిగిలిన కొద్ది సైన్యములతో సమరికను నేనాని గేట్సు ఉత్తర కరోలినా రాష్ట్రములోనికి పారిపోయెను, దక్షిణకారో లినా రాష్ట్రములోనుండి వచ్చిన దేశాభిమానులను నడపుచున్న సమ్ఫుటరు సేనాని పై ఆంగ్లనే లాకస్మికముగ పడి యోడించి చాల మందిని యుద్ధములో చంపి కొందరిని ఖైదీలుగా పట్టుకొనిరి. సమ్ఫుటరు సేనాని ఒంటరిగా నెత్తి విూద టోపీ కూడా లేకుండా జీను లేని గుర్రము పై నొక్కి పారిపోయెను.


కాని వేరొక చోట అమెరికను పక్షముకు