పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

165

అమెరికాసంయుక్త రాష్ట్రములు


చోట్లను ప్రారంభించగ వెంటనే వణచి వేయబడెను. 19వ జూన్ పార్లమెంటు సమావేశమయ్యెను. రోమను కాథలిక్కులకు కొన్ని స్వల్పమగుహక్కుల నిచ్చుచు చట్టమును చేసిరి. జులై 6వ తేదీన యల్లరులు చేసినవారిలో ముఖ్యు లను విచారించి శిక్షలను విధించిరి. స్పైన్ దేశము ఆంగ్లే యులతో రాజీకి రావలెనని కొంతవరకు రాయబాగములు జరిపెను. కాని రోమను కాథలిక్కుల పై జరిగిన అల్లరుల వలన రోమనుకాథలిక్కులగు స్పైన్ ప్రభుత్వమువారు మనస్తాపము నొంది. సంది పయత్నములను విరమించిరి. అమెరికా, పొన్సు మొదలగు దేశములతో ఇంగ్లాండు యుద్ధము చేయుచు. యూరపులోని పెక్కు ప్రభుత్వములవా రింగ్లాండు యొక్క వర్తకమునకు నస్టకరముగ కట్టడి చేసుకొని యన్న నీసమయ మున నీఅల్లరులు జరుగుటంబట్టి యాంగేను జన బాహుళ్య మాయద్దవిషయములలో నెట్టి శ్రద్దయు పుచ్చుకొనుట లేదని. గోచరించుచున్నది.


ఆంగ్లేయ సేనాని
కారన్ వాలీసు ప్రభువు
కాండన్ వద్ద గొప్

1760 సంవత్సరమంతయు అమెరికాలోని దక్షిణప్రాంతముననే యుద్దము జరుగుచుండెను. దక్షిణ కారోలినా రాష్ట్ర మాంగ్లేయుల మయ్యెను. కాని యూరాష్ట్రము నుండి కొందరమెరి:కను దేశభక్తులు లేచిపోయి పక్కనున్న ఉత్తర కారోలీనా రాష్ట్రములో చేరి యండి సమయము దొరకినపుడెల్ల నాంగ్లేయుల పైబడుచుంరి. ఆగస్టు నెలలో నిచటికి వాషింగ్టను కొంత సైన్యము.పంపెను. పర్జీనియా రాష్ట్రమునుండియు కొంత సైన్యము •