పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

167



ప్రజలకుగూడ కొన్ని హక్కుల నిప్పెంచెదమని మూత పెట్టి యాంగ్లేయ దేశము పై తిరుగబాటు చేయుటకు సిద్ధము చేయుచుండిt. ఐర్లాండు పార్లమెంటుకు స్వతం, త్రాధికారము కావలెననికూడ గోరిరి. 1779వ సంవత్సరము సవంబరు 25 వ తేదిన లండనులో ఆంగ్లేయ పార్లమెంటు సమావేశమై నపుడు ఐర్లాండు దేశములోని కల్లోలమునుగూర్చి యోచించిరి. ఐర్లాండు దేశపు ఏరకమునకును రోమనుకాథలిక్కు మతస్తులకును కొన్ని హక్కుల నిచ్చుటవసరమని ప్రధాన మంతి చెప్పి ను. రోమను కాథలిక్కులకు హక్కులనగనే పార్ల మెంటు సభ్యులలో కొందరికి చాలకష్టముగ తోచెను. వెంటనే ఇంగ్లాండులోను స్కాట్లండులోను రోమను కేథలిక్కులకెట్టి హక్కుల నివ్వగూడ దనియూందోళనము చేయుటకు అనేక సంఘములు స్థాపించబడెను. ఈ సంఘములన్నియు కేంద్రీకరింపబడి యొకప్రొట స్టెటు సంఘమునకను బంధములుగ, చేయబడెను. వీరనేక మహజర్లను పార్లమెంటునకు బంపిరి, పైగ జూన్ 2 మొదలు జూన్ 8వ తేదివరకును లండనులో గొప్ప ప్రజుయల్లరులు జరిగెను. ప్రజాసమూహములు బయలు దేరి రోమను కాథలిక్కుల దేవాలయమును యిండ్లను తగుల బెట్టిరి. బ్యాంకిని దోచుకొనిరి. ప్రభుత్వ సైనికు లీయల్లరుల నణచుటకు యత్నించగ యనేకమంది యుభయ పక్షములను హతులైరి లండనులోని యనేక భాగములలో మంటలు లేచెన. మంటలలో కూడ ననేకులు చనిపోయిరి. లక్ష యెనుబది. 'వేల సవర సులు కిమ్మతుగల యాస్తి పాడ య్యెస. ఇట్టీయల్లరులే బొస్టలు మొదలగు కొన్ని ఇతర