పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

అమెరికా సంయుక, రాష్ట్రములు



కాథలిక్కులు పార్లమెంటు సభ్యులగుటకుగాని, పార్లమెంటు సభ్యులను యెస్నుకొనుటకుగాని, సైనికులుగ చేరుటకుగాని ఏ ప్రభుత్వోద్యోగమును చేయుటకు గాని న్యాయవాదుల గుటకుగాని పురపాలక సంఘముల సభ్యులగుటకు గాని వీలు లేకుండ చట్టములను చేసిరి. రోమను కాథలిక్కే గాక ఆంగ్లేయ దేశపు ప్రొటస్టంటు శాఖకు చెందని యితర ప్రాటస్టంటు మతస్తులుకూడ నెట్టి యుద్యోగమునకును అర్హులు కారని శాసించిరి. కావున ఐర్లాండు యొక్క పరిపాలనాధికార మంతయు ఆంగ్లేయ దేశమునుండి వచ్చి కాపురముండి నట్టియు ఆంగ్లేయ దేశపు ప్రాటస్టెంటు మత శాఖకు చెందినట్టియు నూటికి పదిమంది జన సంఖ్యగల ,ప్రభువుల యొక్కయు వారి ఆంగ్లేయ యనుచరుల యొక్కయు సధీనమన నుండెను. ఐర్లాండు ప్రజలు చాలవరకు ఆంగ్లేయుల భూములను దున్నచుండెడి బీద రైతులైరి. ఐర్లాఁడు ప్రజన వర్తకము పడు కూడా ఆ గకర మగు చట్టము లాంగేయ ప్రభుత్వముచే చేయబడ్డాను. ఐర్లండుప్రదాలు పేదరికములో మునిగి యండి. అచట జమదేవత తన నివాస మేర్పరచుకొనినది.


1779న సంవత్సరమున పరాసువారు ఐర్లాండు పై దండెత్తుదు రనువార్త తెలిసి అరవయి వే మంది ప్రాట స్టెంటు ఐచ్ఛిక సైనికులు పోగయిరి. కాని ఈ అవకాశము తీసుకొని ఐర్లాండులోని ఆంగ్లేయ ప్రభువులు ఐర్లాంను పార్ల మెంటున ఆంగ్లేయ పార్లమెంటు మీద పరాధీనత తప్పించవలసినదనియు వర్తకపు హక్కుల నివ్వవలసినదనియు నాందోళనము చేయ సాగిరి. ప్రొటస్టంటు ఐచ్చిక సైనికులు రోమనుకాథలిక్కు