పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

165

ఎనిమిదవ అధ్యాయము



నెక్కువమంది యంగీకరించుటయు లేదా తిరస్కరించుటకు మాత్రమే చేయవలెను గాని ఐర్లండు పార్లమెంటు వారికి స్వంతముగ చట్టముల నువపొదించు సధికారము లేకుం డెను. ఐర్లండు ప్రభువల సభమీద ఇంగ్లాండు ప్రభువుల సభకప్పీలు (విమర్శనాధికారము) గలదు. ఆంగ్లేయ పార్లమెంటువారు చేయుచట్టములను ఐర్లాండువ రిని బద్ధులను చేయును, కాని ఐర్లాండు యొక్క పార్లమెంటులో నున్న వారందరును ఇంగ్లాండు నుండియు స్కోట్లండు నుండియు వచ్చి కాపురమున్న ప్రొటస్టంటు మతస్తులు. ఆంగ్లేయులు ఐర్లండులో ముఖ్యముగ అల స్టరు ప్రాంతమున వలసవచ్చి నివసించి ఐర్లాండులోని చాల భూములను స్వాధీనమును పొంది గొప్ప భూఖామందులై యుండిరి. వీరాంధేయ దేశపు ప్రొటస్టంటు క్రైస్తవమత శాఖకు చెందినవారు. వీరు ఐర్లాండులోని ప్రభువుల సభలో సభ్యులగుటయేగాక ఐర్లాండు ప్రజా ప్రతినిధి సభయు వీరి చేతులలోనే యుండెను. వీరికిష్ట మువచ్చిన వీరి పలుకుబడి లోని ప్రొటస్టంటలను ప్రజాప్రతినిధిసభకు నియమించు చుండిరి. ఐర్లాండు ప్రజలలో నత్యధిక సంఖ్యాకులు రోమను కాథ లిక్కులు, ఆంగ్లేయరాజులు అయిర్లాండును జయించగనే రోమను కాథలిక్కు భూఖామందల భూములను లాగుకొని ఆంగ్లేయ దేశమునుండి వచ్చిన ప్రొటస్టంటు భూఖామందుల కిచ్చిరి . ఐర్లాండులో నూటికి ఎను బదినలుగురు రోమను కాథలిక్కు లుండిరి. నూటికి పదునారుగురు మాత్రమే ప్రొట సెంటులు గలరు. ఆంగ్లేయ ప్రభుత్వము పొరు ఐర్లాండులోని రోమను కాథలిక్కుల కన్ని రాచకీయ హక్కులను తీసి వైచిరి. రోమసు