పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

ఎనిమిదవ అధ్యాయము



అమెరికా సంయుక్త రాష్ట్రములు సముద్రము మీద యుద్దము తీవ్రముగ జరుగు చుండెను. ఆంగ్లేయ నాకాసేనాని అడ్మిరలు రోడ్ని జనవరి 8వ తేదీన 15 స్పైన్ వర్తక యోడలను 7 యుద్ధనౌకలను పట్టుకొనెను.. 16 వ తేదీన సెటువిన్సెంటువద్ద స్పైన్ వారి నౌకాదళము నోడించి వారి పదకొండు నౌకలలో నేడింటిని నాశనము చేసెను. జిబాల్టరు పైబడి దానిని స్వాధీనపరచుకొనెను. మైనారా ద్వీపమును జయించెను. పశ్చిమ యిండియా ద్వీపములకై వయనమై పోయెను. అక్కడ పరాసు నౌకాదళమును ముట్టడించెను. గానీ జయము పొందలేదు నాంగ్లేయ నేనానికి సాయము చేయటకుగాను తన నౌకాదళముతో అమెరికా దేశమునకు చేరెను.

హాలెండుతో
ఆంగ్లేయులకు
కలహము.

ఈలోపున మరియొక దేశము యుద్ధములోనికి లాగబడు చున్నది. తటస్తమ గనున్న దేశములలో కెల్ల హాలండు నకు విరివిగ విదేశ వాణిజ్యము గలదు. యుద్ధమువలన వీరు ఎక్కువలాభము పొందుచున్నారు. అమెరికా వారు కూడ వీరి సరుకులనే ఎక్కువగా కొనుచున్నారు. యుద్దములోనికి దిగియున్న ఇతర దేశముల వారును వీరి సరుకులనే కొనుచున్నారు. వీరి ఇటులయిన తమ పక్షమున యుద్ధము లోనికి- చేర్చుకొనవలెనని ఆంగ్లేయులు ప్రయత్నించిరి, పాత యొడంబడిక అను బయట పెట్టిరి. ఆంగ్లేయులకు యుద్దములోయము చేయుటక హాలండువా దివరకే మొడంబడి. యండిరనీ చెప్పిరి. కాని హాలండువారు పోరాడదలచలేదు.