పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

161


చెప్పెను. జులై నెలలో నారు వేల మంది పరాను సైనికులు న్యూపోర్టు రేవులో వచ్చిదిగిరి. వారితో చేరుటకు వాషింగ్టనువద్ద మనుష్యులుగాని సామగ్రులుగాని లేకుండెను. రెం డవ పరాసుసేన ఫ్రాన్సులోనుండి బయలు దేరకమునుపే బ్రెస్టు రేవులో నాంగ్లేయులచే నాటంక పరచబడెను. మరియు నిచట న్యూపోర్టు రేవునుకూడ ఆంగ్లేయనౌకాదళము ముట్టడించెను. పశ్చిమ ఇడియా ద్వీపములలోని వరాసువారిని, స్పెయిన్ గారిని సహాయము తెచ్చుకొమ్మని వాషింగ్టనుకు దేశీయ మహాజనసభ వారు అధికార మిచ్చిరి. వాషింగ్టను మిగుల దుస్థితిలో నుండెను. ఏమిపై న్యము తెచ్చుకున్న ను ప్రయోజనము లేదయ్యెను. వచ్చినవారు తిండి లేక మాడ వలసినదే. లేని చో వారిని యిండ్లకు వంపి వేయవలసిన దే. ఇంత కన్న యేమిచేయటకును తోచుట లేదని వాషింగ్టను వ్రాయు చుండెను. జనేవరి 1 వ తేదీన తనవద్దనున్న సైస్యములలో సగము వెళ్ళిపోవుననియు తక్కినవారు. దేశాభిమానమువలన మాత్రమే నిలిచి యుండవలసిన దేగాని మరియే కారణము చేతను నిలిచియుండరనియు వాషింగ్టను మరల వ్రాసెసు. అమెరికా దేశీయు లింతకన్న యెక్కవ సహాయమును చేయ నిచో అమెరికను సైశ్యములు పేరువకుగూడ నుండపనియు అమెరికా దేశములో అమెరిళా ప్రజలపక్షమున విదేశీయులు మాత్రమే పోరాడుచుండునంతటి యవమానకరమగు స్థితి త్వ రలో సంభవించ నున్నదనియుకూడ నాయన దేశీయ మహా సభ వారికి తెలిపెను. కానియీకాలమున , నాంగ్లేయులును న్యూజెర్సీలో దండెత్తుట తప్ప మరి యేమియును చేయలేదు