పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అమెరికా

సంయుక్త రాష్ట్రములు.

మొదటి అధ్యాయము

ఉపోధ్గాతము

(1)

ప్రస్తుతము ప్రపంచమున నైశ్వర్యమునకును, ప్రకృతి శాస్త్రములకును, పరిశ్రమలకును, నవనాగరికతకును ప్రసిద్ధిచెంది, ప్రభుత్వములలో రాష్ట్రములు మిగుల పలుకుబడికలిగియున్న, అమెరికా సంయుక్త రాష్ట్రములు (United States of America) మూడు వందల సంవత్సరములకు పూర్వము లేవు. అపుడచట అరణ్యము లెక్కువగనుండి కొద్ది నాగరితగల తామ్రవర్ణపుజాతులు నివసించియుండిరి. గడచిన మూడువందల సంవత్సరములనుండియు యూరపుఖండవాసులగు తెల్లవారు అచటికి వలసవచ్చి, అదివరకచట కాపురముండిన యెర్రజాతులను చాలవరకు నాశనముజేసి దేశమునంతను ఆక్రమించుకొని సుప్రసిద్ధమగు నీ సంయుక్త రాష్ట్రముల నేర్పరచిరి. అచటికి వచ్చిన తెల్లజాతులవారిలో ఇంగ్లాండు నుండి వచ్చిన ఆంగ్లేయు లధిక సంఖ్యాకులగుటచే నీవలస రాష్ట్రములు 1775 వ సంవత్సరము వరకును