పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమెరికా సంయుక్త రాష్ట్రములు


ఆర్థిక
స్వతంత్రము
లేని ప్రజలు.

అమెరికాలో నింకను అమెరికనులస్థితి ఏమియా.బాగుగ లేదు. వీరికింక ఒక ప్రభుత్వము స్థాపనశాలేదు. ప్రభుత్వము లేని ప్రజలుగ నుండిరి, " ఫ్రాన్సు మన స్వాతంత్ర్యము సంగీకరించి మనకు సహాయము చేతునని యొప్పుకొనుటచేశ, మనవారు తాము చేయవలసిన పని యేమియు లేదని తలచి నిద్రావస్తను చెందుదురని తోచుచున్నది ” అని వాషింగ్టనుమేనెల 5వ తేదీననే వాసెను. దేశీయ మహాజనసభవారు కాగితపు నోట్లను పుట్టించుచున్నారే గాని వాటి చలామణి సంగతి యోచించుట లేదు. రాష్ట్రముల వారును కాగితములను వేయుచున్నారు. ఈ కాగితములను తోడి రాష్ట్రముల వారికిచ్చి ఋణములను • తీర్చుకొనుచుండిరి. అమెరికాలో మష్యమును ప్రోగుచేయు సాధనము కనుపించక ఫ్రాన్సులో పన్నెండులక్షల సవరనుల ఋణము చేయవలసినదని ఫోన్సు లోని తమ ప్రతినిధులకు తెలియచేసిరి. ఏదో విధమున యాచించి సొమ్మ పోగుచేయవలెనని వీరి యుద్దేశ్యము. ఆంగ్లేయ రాజుమీద స్వతంత్రమును ప్రకటించి రేగాని వీరు స్వతతత్రమగు ఆర్దిక స్తితిని పొందుట కశక్తులై "ఫోన్సరాజు మిక్కిలి యాదార్యముతో తమను సంరక్షించ పలెనని ” మిగుల విసయముగా కోరవలసినదని బెంజమిన్ ఫ్రాన్కులిసుకు వ్రాసిరి. యూరపు ఖండమునుండి ఋణములను ద్రవ్యసహా యమును పొందుటకన్న గత్యంతరము లేదని తలచిరి. బెంజమీను ఫాస్కులిను పరాసు దేశములో ఋణమునకై యత్నించు చుండగా హాలెండులో కూడ ఋణము - సంపాదించుటకు