పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

అమెరికా సంయుక రాష్ట్రములు


రోడు అయిలందులోని నీ రిపోర్టునందుగల ఆంగ్లేయ సేనలను ముట్టడించతలచిరి. సల్లెలిన్, లఫయతు, గ్రీక్ , సేనాసుల క్రింద సమెరికను సైన్యములు భూమిమీదనుండియు, పరాసు నౌకాదళము సముదముమీద నుండియు, ఆంగ్లేయులను ముట్టడించవలెనని పన్నిరి. కాని వారము రోజులవర కమెరికను సేనలు సిద్ధము కాలేదు. ఇంతలో హో సేనానిక్రింద నాంగ్ల నౌకదళము వచ్చెను. దానిని ముట్టడించుటకు ఏస్టింగుప్రభువు పరాను వారాబలమును తీసుకొని వెళ్ళెను. కాని గొప్ప తుపాను సంభవించి ఉభయ వర్గములవారును తలపడుటయే తప్పిపోయినది. పరాసు నౌకలకు కొంత తుపానువలన నష్టము కలిగినదని బాగుచేసుకొనుటకు బాస్టను రేవులోనికి ఏస్టింగు పరాసు నౌకాదళమును చేర్చెను. ఇట్లు చేయుట లఫయతునకును గ్రీన్ సేనానికిని ఇష్టము లేదు. ఇందువలన సల్లివసు సేనానిక్రింద వచ్చిన అమెరికను సైన్య ములు వెనుకకు మరలి రావలసివచ్చెను.

అమెరికనులపై
ఎర్ర యిండియనులు
ప్రయోగింపబడుట.

1778 సంవత్సరము జులై నెలలోను నవంబరు నెలలోను ఆంగ్లేయులును అమెరికను రాజభక్తులునుఎర్రయిండియనులను అమెరికను దేశ భక్తులపై రయోగించిరి. షుష్కినా, షెర్రి పల్లపు భూములలోను ముఖ్యముగ వోమింగు ప్రాంతములోను వున్న అమెరికనులమీద ఎర్రయిండియసు లకస్మాత్తుగ పడి పట్టణములను తగుల బెట్టిరి. ఆమెరికను పురుషులను స్త్రీలను శిశువులను క్రూరి వధల గావించిరి