పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము.

145




చేర్చనిది " ఎట్టిషరతులను గూర్చియు 'రాయణరములు జరువమనియు నిదివరకే యిట్టి జవాబును చెప్పి యున్నా మనియు దేశీయ మహా సభ వారు ప్రత్యుత్తర మిచ్చిరి. జూన్ 17, 18 తేదీలను ఆంగ్లేయ సేనలన్నియు ఫిలడల్ఫియాను వదలి దలవేరు నదిని దాటి వెళ్లిపోయెను.

మానుమౌతు వద్ద
అమెరికనుల
జయము.


జూన్ 28వ తేదీని వాషింగ్టను మానుమౌతువద్ద నాగ్లేయ సేనలను తలపడెను. అప్పుడుష్టము అతియెక్కువగ నుండెను. యుద్ధము తీవ్రముగ జరిగెను. అమెరికనులకు సంపూర్ణముగ జయము గలిగెను. రాత్రి వేళ ఆంగ్లేయులు పారిపోయిరి, నూరుమంది ఆగ్లేయ సైనికులు ఖయిదీలయిరి. రెండువందల యేబది వుంది మరణించిరి,


జులై 2 వ తేదీన దేశీయమహా జనసభ వారు ఫిల డల్ఫియా పట్టణమున సమావేశ మైరి. తొమ్మిదవ తేదీన సంయుక్తప్రభుత్వపు నిబంధనల మీద ఎనిమిది. రాష్ట్ర ముల ప్రతినిధులు సంతకము చేసిరి. తక్కిన అయిదు 'రాష్ట్రములకు నీ పవిత్రమైన యొడంబడికె పి సంతకములు చేయవలసిన దని యుత్తరమును బంపి. నెలలోపలనే మరి రెండు రాష్ట్ర ములవారును సంతకములు చేసిరి. (2)

పరాసు
సేనలు వచ్చుట.


జులై 8వ తేదీన పరాసు దేశమునుండి నౌకాదళ మమెరికారు చేరి డెలవేరు నది ముఖద్వారము వద్ద దిగెను. ఏస్టింగు ప్రభువు యొక్క సేనాధిపత్యము క్రింద పరాను సేనకూడ దిగెను.