పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

అమెరికా శంయుక్త రాష్ట్రములు



మనియా,. ఆ గ్లేయ రాజు అమెరికా సంయుక్త రాష్ట్రములతో చేయుచున్న అధర్మసుగు యుద్ధము సంతరింపజేయవ లేనని నిజముగ గోరుచో, స్వతంత్ర దేశము యొక్క మర్యాదల తోడను సంధిషరతుల నమలుజరుపు పవిత్రోద్దేశ్యముతోడను తాము రాజీకి వచ్చుట కెట్టియభ్యంతరము లేవనియు” దేశీయ మహాజనసభవారు ప్రత్యుత్తరమును బంపిరి.


వారి ధీరత్వము


ఆదినముననే ఆంగ్ల రాయబారులు ఫిలడల్ఫియా పట్టణమునకువచ్చిరి. ఆసమయముస నాంగ్లేయులా పట్టణమును వదలి వెళ్ళుచుండిరి. అసమయ ముగ సొంగ్లేయ ప్రభుశ్వమునుండి వచ్చిన రహస్యపు ఉత్తరువుల ననుసరించి వారటుల వదలిపో వుచుండిరి. కాని ఈయుత్తరువులు - రాజభ క్తిగల అమెరికనులలో మితి లేని విచారమును కలిగించెను. ఆంగ్ల సేనలతోకూడ మూడు వేల మంది అమెరికను రాజభక్తులు బయలు దేరి వెళ్ళిపోయిరి. రాష్ట్రము లన్నియు తమయిచ్చవచ్చిన చట్టములను చేసుకొను హక్కును తమ కచ్చపచ్చి రీతిని రాష్ట్ర పరిపాలనను జగపుకొను హక్కును, అంగేయపార్లమెంటులో నమెరికనులకు ప్రాతినిధ్యమును వీరి యిష్టము లేనిది ఎట్టి సేనలను వీరి ప్రదేశములలోని, కాంగ్లేయులు తేకుండు హక్కును చేర్పించెదమనియు, నౌక మీద ఆంగ్లేయ సేనలనన్నిటిని ఇంగ్లాండునకు వెంటనే చెప్పించెద మనియు, సంధికి రావలసినదనియు, నాంగ్లేయ రాయబారులు తిరిగి దేశీయ మహాజన సభ వారికి వ్రాసిరి. జ్యూన్- 17 వ తేదీన " ఆంగ్లేయులు తమ స్వతంత్రమును స్పష్టముగ సంగీకరించ వలసినది లేదా ఆంగ్లేయ సేనలనన్నిటిని ఆంగ్ల దేశములో