పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

143



లో తెలసెను. వాషింగ్టను సేనాని గాని దేశీయ మహాజన సభాద్యక్షుడుగాని కొన్ని దినములవర కావర్తమానమును నమ్మలేదు. వాటియాదార్ధ్యమును వాషింగ్టను సమ్మగనే వాటినిగూర్చి అమెరికాలోని ప్రజలెటుల భావించెదరో యని ఆయనకు సంకోచముకలిగెను. అప్పటికి అమెరికనులలో చాల మందికి యుద్ధమునందు విసుగుపుట్టినటుల సూచనలు పొడగట్టు చుండెను కావున ప్రజలు పట్టుదలతో స్వతంత్ర యుద్ధమును జయప్రదముగా కొనసాగించుటకు మారుగ నాంయులిచ్చిన హక్కులతో తృప్తి చెంది రాజీ కొడంబడెదరేమోనను సందేహ మాయనకు కలిగెను. ఈ సంధి రాయబారములను త్వరపడి అంగీకరించుటగాని లేక తిరస్కరించుటగాని యుక్తముకాదని ఆయన తలంచెను. ఏప్రియలు 22వ తేదీన దేశీయ మహా జనసభవారు మాత్రము " "వెంటనే అమెరికాలోనుండి ఆంగ్లేయ సేనలన్నియు తీసి వేయబడిననే గాని, లేదా స్పష్టమగు మాటతో నమరి సంయుక్త రాష్ట్రముల స్వతంత్రము సంగీకరించినసేగాని, ఆంగ్లేయ రాయభారులతో సంధివిషయమున నెట్టిమాటలను జరుపగూడదని తీర్మానించిరి, ఇంతలో ఫాస్సుతో జరిగిన సంథిసంగతికూడ తెలిసినందున వీరి పట్టుదల యనేక మడుంగు లధికమయ్యెను.

దేశీయ మహాసభ వారి
ఆత్మ గౌరవము

జూను 4వ తేదీన ముగ్గురాంగ్లేయ సంథి రాయబారు లు అమెరికాకు చేరిరి. జూన్ 6వ తేదీన ఆంగ్లేయపార్లమెంటువారి చట్టములను అమెరికా దేశీయ మహాజన సభవారికి కంపిరి. " ఏపి)లు నెలలోనే తామివిషయమున తీర్మానము చేసియుంటి