పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

అమెరికా సంయుక్త రాష్ట్రములు


చుత్సాహము వ్యాపించెను. అనేకులు వచ్చి సైన్యములలో చేరుచుండిరి.

పరాసు సంధికి
వాషింగ్టను యొక్క
సంతోషము.

1778 సంవత్సరము మే నెల పరాను దేశముతో చేసికొనిన 8వ తేదిన నంధిషరతులమెరికా పరాను సంధికి దేశ మహాజనసభ వారికి చేరగానే వారు వాషింగ్టముకు బంపిరి. "అమెరిశా సంయుక్తరాష్ట్రముల స్వతంత్రమును కాపాడుటకును మాహక్కులను స్వతంత్రములను స్థిరముగ స్థాపించుటకును లోకములోని రాజులలో నొక బలవంతుడగు ప్రభువును మా వశమున చేర్చుటకు సర్వశక్తుడగు భగవంతుని కనుగ్రహము వచ్చిందని ఆయన సైనికులలో ప్రకటించెను, మరునాడు సంతోషదినముగ సలుపబడినది. సైనికులు దేవునికి వంద నముల నర్పించిరి. జయసూచకముగ తుపాకులు కాల్చబడెను. " ఫోన్సు దేశపు రాజు చిరాయువగు గాక! ” " అమెరిళా సంయుక్త రాష్ట్రములకును వీరికి మిత్రులగు యూరొపు దేశముల వారికిని జయము కలుగుగాక ! ” అని జయధ్వనులు చేయబడెను. దేశీయ మహాసభవారు కొత్త సైన్యములను పోగుచేసిరి. యుద్దము ముగిసిన తరువాత సైనికోద్యోగులకు సగము జీతమిచ్చెమదని పొగ్గ త్తము చేసిరి.


దేశీయ మహాసభ
వారి పట్టుదల.

ఫౌంస్సుతో సంధిచేసుకొనిన సంగతి అమెరికాలోతెలియుటకు కొన్ని వారములకు మునుపే ఆంగ్లేయ పార్లమెంటువారు అమెరికలను వారికట్టుడం తృప్తి పరచుటకై చేసిన చట్టములను ఆసం దర్భను న నార్తు ప్రభువిచ్చిన యుపన్యాసమును న్యూయార్కు