పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ అధ్యాయము

141



వని సభ్యులలో చాలమంది తలంచిరి. రాజునకు నార్తు ప్రభువును ప్రధాన మంత్రిత్వమునుండి తప్పించుట ఇష్టము లేదు. “ఏప్రిలు 7వ తేదీన పార్లమెంటు సభకు విలియంపిట్టును రావించిరి. ఆయన పడక కుర్చీలో పరుండెను. లేచి నిలువగల స్థితిలో లేడు. ఆంగ్లేయుల సైన్యములను నౌకాదళములను తీసి వేయవలసిన దనియు మంచిమాటలచే రాజీపడవలెననియు రిచ్మండు ప్రభువొక తీర్మాసము సపపాదించెను అందు కూడ చర్చ జరిగిను. ఇదివరకు అమెరికా వారితో సంధి వేసుకొమ్మని చెప్పియున్న ఇలియంపిట్టు కివుడు తమ శత్రు దేశములగు పరాసు, స్పేయిన్ దేశము అమెరికనులతో చేరియున్న సమయమున రాజీపడుట అసంబద్దమని తోచెను. ఇట్టి స్థితిగతులలో నమెరికాకు స్వాతంత్య మిచ్చుట అవ్యక్తమని ఆయన తలచెను. " నేనీ సభలో మాట్లాడ శక్తియున్నంతవరకు అమెరికాకుస్వతంత్ర, మివ్వగూడదని చెప్పితీరెదవ"నీ, ఆయన చెప్పెను. ఆయన ధ్వని మిగుల బలహీనముగ నుండెను. చెప్పినదానినే . మరల మరల చెప్పెను. తలంపులు సరిగవచ్చుట లేదు. దీనికి రిచ్మండు ప్రభువు ప్రత్యుత్తరమిచ్చెను. అంద మీద విలియంపిట్టు లేచెను. ఏమో చెప్పెను. స్పృహతప్పి పడిపోయెను. పార్ల మెంటు సభ చాలించబడెను, మే 11 తేదీ వరకును ఆయన జీవించియుండెను. ఆయన చనిపోపగనే పార్లమెంటు సమావేశమై ఆయనకుగల ఋణములను తీగ్చుకొనుటయే గాక ఆయన దినవారి ములకగు ప్రయమును ఆయన వారసులకు సంవత్సరము నకు నాలుగు వేల సవరనుల యుపకార వేతరమును ఇచ్చుటకు తీర్మానించిరి. ఫ్రాన్సు పై యుద్ధము చేయుట కాంగ్ల దేశమునం