పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

అమెరికా సంయుక్త రాష్ట్రములు


యని యొక, సభ్యుడు. ప్రధానతుంత్రిని ప్రశ్నించెను. ప్రధాన మంత్రి, ఈప్రశ్నకు జవాబు చెప్పక వేరు సంగతులను గూర్చి ప్రముగించు చుండెను " దీనికి ముందు జవాబు చెప్పుము, జవాటుచెప్పుము " అని కొందరు సభ్యులు కేకలు వేసిరి. అందు మీద సుధీ జరగ లేదని చెప్పక తనకు ఉద్యోగరీత్యా సంధి సంగతి తెలియదని ప్రధానమంత్రి జవాబు చెప్పెను. అమెరి కనులను తృప్తి పరచుటకని మూడు చట్టములు చేయబడెను,మెసషు సిట్సు ప్రజలలో నాందోళనము కలుగుచున్నది. గా వున నారాష్ట్రమున కిదివరకుగల ఎన్నిక హక్కులను తిరిగి కలుగచేయడ మైనదను చట్ట మొకటి. తేయాకు చట్టమును రద్దుపరచుచు విదేశ వాణిజ్య విషయములో తప్ప రాష్ట్రములలోని ఆంగ్లేయపార్లమెంటు గారుపన్నులు వేwటకు ప్రజలపై హక్కు లేదను చట్టము రెండనది. అమెరికానుండి ఆంగ్లేయ సైన్యములను తీసివేయుటకును ఏరాష్ట్రముతో నైనను సంధిచేసు కొనుటకును క్షమాపణల నిచ్చుటకును ప్రజల యిబ్బందులను తొలగించుటకును యిద్దరు కమిషనరులను నియమించుచట్టము మూడవది. ఈ చట్టములు చేయుటవలన నాంగ్ల పార్ల మెంటువారు తమ బలహీనతను వెల్లడించిరేగాని వీటివలన అమెరికనులు తృప్తి చెందలేదు.

విలియంపిట్టు
యుద్దమునకు
పురిగొల్పెను.


మార్చి 17వ తేదీన అమెరికాలో చేసికొనిన సంధిషరతులను పరాసుప్రభుత్వమువారు పంపినారని ఆంగ్లేయ మంత్రులు పార్లమెంటు సభకు చదివి వినిపించిరి. ఈ సమయమున అనారోగ్యముషలన బాధపడుచుండిన - విసవిలియం పిట్టును ప్రధానమంత్రిగా చేసిన యుక్తముగ నుండు