పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

అమెరికా సంయుక్త రాష్ట్రములు


లేదు. ఆమెరికను దేశీయ మహాజనసభవారు సృష్టించిన (కరెన్సినోట్లు) కాగితపు ద్రవ్యము మాత్రము గలదు. దీనిని పుచ్చుకొని కావలసిన వస్తువుల నిచ్చువారు లేకుండిరి. దేశీ యమహాజనసభ వారివద్దదవ్యము లేదు. ఎవరునుఋణములిచ్చుటలేదు. ఉత్సాహముతో సభ్యులు సభలకు వచ్చుట లేదు. ఉరకె కాగితములను సృష్టించుచుండిరి. ఈ కాగితపు ముక్కల విలువ తగ్గిపోయెను. వాషింగ్టనుకు గాని ఆయన సైనికులకు గాని దుస్తులు లేకుండెను. డిశంబరు నెలలో నాహారపదార్తము లయిపోయెను. "వెంటనే తగిన ఏర్పాటుల సు చేయనిచో సైనికులుపవాసము చేయుటగాని లేక ఇండ్లకు పోవుటగాని జరుగ గలదని” ఆయన దేశీయసభాధ్యక్షునికి వ్రాసెను. "ధరించుటకు దుస్తులుగాని తొడుగుకొనుటకు పాదరక్షలుగాని లేక దాదాపు మూడు వేల మంది సైనికులెట్టి పనిచేయుటకును అనర్హులుగ నుండిరి. చుట్టు ప్రాంతములనుండి దొరకినదాని నెల్ల బలవంతముగ తెమ్మని సైనికులను బంపవలసివచ్చెను. ఇట్లు చేయుటవలన ప్రజల సొనుభూతిని గోల్పోవుదునని కూడ నాయన దేశీయ మహాసభ వారికి వ్రాసియుండెను. కొంతకాల మునకు చుట్టు పట్టులనుకూడ ఏమియు దొరుకకుండెను. గుర్రములు చాలవరకు తిండి లేక చనిపోయెను. మార్చి 11వ తేదీనుండియు మనుష్యులకు కూడ తిండి లేకుండెను. ఆరుదినములు వాషింగ్టను సైనికులతో కూడ .నుపవాసము చేసెను. యావత్తు సేనలో రెండు పాదరక్షల జత మాత్రమే మిగిలి యుండెను. సైన్యములలో జ్వరములు వ్యాపించి యనేకులు మరణించిరి. అనేకమంది సైన్యములను పదలి వెళ్ళిపోవుచుం