పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

అమెరికా సంయుక్త రాష్ట్రములు



ఆంగ్ల సేనలనుండి 'ఎరయిండియనులును అమెరికను రాజభక్తి పరాయణులును జూరిపోసాగిరి. ఆంగ్లేయులకు భోజనపదార్గ మలును వారిగుర్రములకు తిండియు దొరకకుండెను. ఇంతలో గేట్సను అమెరికను సేనాని కొత్తసేసటతో వచ్చెను. అమెరికను సేనలు బలపడెను. తిరిగి ఆంగ్లేయులును అమేరికనులకును తీవ్రమగు పోరును నలిపిరి. ఆంగ్లేయ సేనాని ఫౌజరు చంపబడెను. రాత్రివరకు యుద్దము జరిగి రాత్రివేళ ఎవరిబసలకు వారు వెళ్ళిరి. ఆంగ్లేయులనష్టము ఏడువంద మందియ నమేరికనుల నష్టము నూటఏబదిమందియు కలిగెను. బరా యిసు సేనాని ఆంగ్లేయ సేనలను సెరటోగా మిట్టప్రదేశములకు తీసుకొని వెళ్ళె. ఎడ్వర్డుకోటలో ప్రవేశించదలచెసు. కానీ అది అమెరికనుల వశముదుండినందున ప్రవేశించలేదు. ఈయనవద్ద మూడు వేల అయిదువందలమంది పోరు సలుప తగిన సైనికులు మాత్రమే గలరు. సరియైన తిండి లేక బాధపడు చుండిరి. పదునాలుగువేల అమెరికను సైనికులు గేట్సు సేనాని క్రింద సచ్చి వీరిని చుట్టుకొనికి. ఆంగ్లేయ సేనానులు యద్దము సలుపజాలక అమెరికనులకు లోబడుటకే నిశ్చయించి . అక్టోబరు 16వ తేదీన అయిదు వేల ఏడువందల తొంబది యొక్క మంది బ్రిటిషు సైనికులు యుద్ధసామానులతోడను "నలుబది రెండు ఫిరంగులతోడను అమెరికనులకు లోబడిరి. నిరాయుధులుగ చేయబడి ఆమెరికనుల మీద యుద్దము చేయ కుండునట్లును వెంటనే ఇంగ్లాండునకు పయనమైపోవుటకును సమ్మతించి వడలివేయబడిరి. ఆంగ్లేయ సైనికులు తిండి లేక శల్యము లై చిక్కియుండు జూచియ మెరికను సైనికులు జాలి