పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

అమెరికా సంయక్త రాష్ట్రములు


వాషింగ్టన్ యొక్క
అపజయములు.

సెప్టెంబరు నెలలో న్యూయార్కునందు బలమైన సైన్యములను క్లింటన్ యొక్క యూధిపత్య ముక్రింద నుంచి అగ్లేయసేనాని హో పదునెనిమిది వేల సైనికులతో ఫిలడల్ఫియాకు ఏబది మైళ్ళ దూరముననున్న ఎల్కు నది యొడ్డున దిగెను. అమెరికను సేనాని వాషింగ్టను పదునాలుగు వేల సైన్యములతో నాంగ్లేయులపై దాడి వెడలెను. సెప్టెంబరు 11 వ తేదీన బొండిలైన్ వద్ద యుద్దము జరిగెను. అమెరికను లోడిపోయిరి. మూడువందలమంది హతులగుటయు ఆరువందలమంది గాయ ములనొందుటయు నాలఁగువందల మంది ఆంగ్లేయులచే పట్టు బడుటయు జరిగెను. లఫయతు ప్రభువుకు కూడ గాయము తగిలెను. ఈ యుద్దములో పోలెండు దేశమునుండి వచ్చిన మరియొక స్వాతంత్ర్యవాది ఫులా క్క-ప్రభువు వాషింగ్టసుకువ సేనాధిపతిగ పోరుసలి పెను. ఇంక కొన్ని సైన్యములు వచ్చి వాషింగ్టనును చేరెను. వీటితో తిరిగి ఆంగ్లేయులతో యుద్ద ముచేయయత్నించెను. కాని తుపానుపట్టి వాషింగ్టను యుద్ధ సామానులు చెడిపోయెను. వాంషీంగ్టను తన సేనలను మరల్పుకొని వచ్చెను. మరియొక అమెరికను సేనాని పది హేను వందల సైన్యములతో ఫిలడల్ఫియా సమీపమున సంగ్లేయులచే నోడించబడెను. ఆంగ్లేయులు సెప్టెంబరు 26 వ తేదీన ఫిలడెల్సియా పట్టణమున ప్రవేశించిరి. అమెరికా దేశీయ మహాజన సభవారు తమ కార్యస్థానమును అచటనుండి లంకాస్టరుకు మార్చిరి. అక్టోబరు 4 ప తేదీన అమెరికను సైన్య ములు వచ్చి ఆకస్మికముగ జర్మను టౌనులోని ఆంగ్ల సేనలపై