పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

129

ఏడవాద్యాయము


ఆంగ్లేయుల
జయములు

జులై 1వ తేదీన గొప్ప సైన్యముతో నాంగ్లేయ నేనాని జనరలు బర్గాయను క్రౌన్ పాయింటును నుండి బయలు దేరి దక్షిణముగా పెళ్లెను. దక్షిణమునుండి హెూ సేనాని క్రింద కొంత సైన్యము వచ్చి కలసెను. ఈ సై స్య ముంతను. టికొందొరీ గా మీదపడగ నక్కడి అమెరి కను సైన్యము లెదిరింప కనే పారిపోయెను. ఆంగ్లేయ సైన్యములమెరికెనులను 'వెంటనంటెను, సైనస్బరోవద్ద అమిరికనులమీదపడి యోడించెను. హడస్సనది మీదనున్న ఎడ్వరు కోటను స్వాధీనపర్చుకొనెను. స్కూలరు కోటను ముట్టడించి దాని సంరక్షణ కై వచ్చిన అమెరికను సేనలను పూర్తిగ నోడించెను . ఈవిధమున ఆంగ్లేయులు జయము లొందుచుండిరి.


రాజభక్తుల
నోడించుట

న్నూహంపుషైర్ రాష్ట్ర ములోని బెన్నింగ్టన్ వద్ద అమెరికను సేసలు స్టార్కు సేనాధిపతిక్రింద యుండెను. వీరిమిదికి ఆంగ్లేయ పై స్యములు వచ్చి ముట్టడించగ స్టార్కు సేనాధిపతి ఆంగ్లే యుల నోడించి తరిమెను. మరియొక ఆంగ్లేలేయ సేనకు కూడా రాగా వారికిని పరాజయమే కలిగెను. బెన్నింగ్టన్ యుద్ధ ములవలన కొంత వరక మెరికనుప్రతిష్ట నిలువబడెను . అమెరికను . సైస్యములు స్కూలరు కోటను ముట్టడించగ న్యూర్కులోని రాజభక్తి పరాయణులను ఎర్రయిండియనులను తరిబీతు చేయుచుంన లిజరసు ఆంగ్లేయ సేనాని మిగుల అధైర్యముతో నాకోటను, అందులోని డేరాలు,సామాసులు, యుద్దపరికరములను వదలి కనడా దేశమునకు పారిపోయెను. అమెరికనులు స్కూలరు కోటలో ప్రవేశించిరి. .