పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

అమెరికా సంయక్త రాష్ట్రములు


బడి యాంగ్లేయ సైనికుల నందరను నేనాధిపతితో కూడ ఖయిదుచేసెను. లఫయతు ప్రభువు ముందురాబోవు పరాసు ప్రజాస్వాతంత్ర్య విప్లవములోను కోసియజుకో పోలండు జాతీయ స్వాతంత్య్ర పోరాటములోను స్వాతంత్రపక్షమున పోరాడి సుప్రసిద్ధులుగా సున్నారు.


అమెరికను
రాజభక్తులు


ఇంగ్లాండులో మూడవ జార్జీ సార్వభౌముడును మంత్రులును అమెరికసుల మీద పట్టుదలతో రాజభక్తులు యుద్దమును సాగించుచుండిరి. 1777 వ సంవత్సరము మేనల 30వ తేదీన ప్రభువుల సభకు విలియంపిట్టు (చాతాం ప్రభువు) అనారోగ్య స్థితి యందేవచ్చెను. పరాసు, స్పెన్, దేశములవారమెరికనులతో చేరక మునుపే అమెరికనులతో సంధి చేసుకొన వలసినదని యొక తీర్థానము నుపపొదించెను. “మీర మెరికనులను జయించ బాలరు. వారి దేశమునుండి వారిని మీరు తమిరివేయ గలరా? వారు స్వాతంత్ర్యమును పొందుటకు దీక్షవహించినపుడు వారిని మీరేమి చేయ గలరు? వారిని మీరెటుల పాలించ గలరు!" అని ఆయన సుడివెను. కాని ఆయనపక్షమున నిరువది ఎనిమిది సమ్మతులును, వ్యతిరేకముగ తొంబదితొమిది సమతులును వచ్చినందున ఆయన తీర్మానమోడిపోయెను. అమెరికనులలో రాజభక్తి గలవారింకను గలరనియు వారిని ఎర్రయిండియనులను రాజద్రోహులగు సమెరికనులమీద ప్రయోగించుటకును, కనడా దేశము నుండి యొక గొప్ప సైన్యము నమెరికనులపై పంపుటకును, మంత్రులు నిశ్చయించిరి.