పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

ఆమెరికాసంయుక్త రాష్ట్రములు


ప్రభువను నొక పదునెనిమిది వత్సరముల యీడుగల పరాసు యువకుడు పరాసు దేశములోని మెట్టుపట్టణమున నొక పరాస నేసకు సేనానిగనుండెను. ఒక దినమున నాగ్గేయ రాజగు మూడవజార్జియొక్క సోదరుడగు గ్లాస్టరు ప్రభువు ఆపట్టణము సందర్శించుటకు వచ్చెను. ఆసందర్బమునా లఫ యతుకు పైయధికారియగు పరాసు సేనాధిపతి గ్లౌసరు ప్రభువుకు విందు చేసెను. అపుడు లఫయతు కూడ నండెను. అమెరికా వారు స్వాతంత్ర్య ప్రకటనము గావించిరను వార్త అప్పుడే గ్లాస్టరుప్రభువు కింగ్లాండు నుండి వచ్చిన లేఖలవలన 'తెలిసెను. ఈసంగతీ లఫయతు బహుశ్రద్ధగా గమనించి గ్లాస్టరుప్రభువును, ప్రశ్నించి తనకు కావలసిన విషయములు తెలుసుకొనెను. అప్పటినుండియు నమెరికావార సైన్యములో చేరి పనిచేయు వలెనని లఫయతు ప్రభువు మనసునందు నిశ్చయించుకొనెను. మరునాడే పారిసునకు పోయి 'అమెరికా వారి సహాయముగ యుద్ధపరికరములను భోజన పదార్దములను గొనిపోవుట కేర్పడిన నౌకయందు ప్రయాణము చేయుటకు రహదారి చీటిని కొనెను. పారిసులోని అమెరికను ప్రతినిధిని దర్శించి మేజరు జనరలుద్యోగ మిప్పించెదనను వాగ్దత్తమును పొందెను. కాని ఇంతలో నూజర్సీ రాష్ట్రమునుండి వాషింగ్టను పారిపోయెనను వార్త తెలియగ సమెరికాకు పోవుటకు నౌక దొరకక పోయెను. పరాసుదేశములోని ఆమెరికనులు కూడ నీయువ కుడగు సేనానిని అమెరికాకు వెళ్ళుటకు మంచి సమయము