పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iv



దేశము, జర్మనీ, ఆస్ట్రియా, రష్యా, దేశముల దాస్యమునుండి తప్పించుకొనినవి. ఇటులనే జెకోస్లావులును జూగోస్లావులును ప్రత్యేక రాష్ట్రములను స్థాపించుకొనినవి.

ఇంక మిగిలినని అయిర్లాండు, ఈజిప్టు, ఇండియూ దేశములు. అయిర్లాండు 7 శతాబ్దములనుండి తన స్వాతంత్ర్యముకొరకు పోరాడుచు కడపటకు రక్తపాతపూర్వక మగు నొక విప్లవముచే నొక విధమగు స్వరాజ్యమును స్థాపించుకొనినది, ఇంక ఈజిప్టు ప్రాక్పాశ్చాత్య దేశముల మధ్యనుండి రక్తపాత మగుపద్ధతులకున్నూ దౌర్జన్య రాహిత్యమగు పద్ధతులకున్నూ మధ్యస్థ మగుపద్ధతుల నవలంబించి తన స్వాతంత్ర్యము కొరకు పోరాడియున్నది. ఇండియాదేశము కేవలము ప్రాగ్దృశమై యుండి అహింసా సత్య ములను ధర్మముల ననుసరించియే స్వరాజ్యమును స్థాపింప యత్నించుచున్నది. కాని కడచిన నాలుగు సంవత్సరములనుండియు గావింప బడిన యత్నములయొక్క జయాపజయములను గూర్చి చర్చించుట కిది సమయము కాదు, స్థలమును కాదు. ఇట్లు ప్రతి దినమును ప్రపంచమునందలి భావములను ఆదర్శములును మారుచున్నవి. ఈనాటికి మన దేశమునందు ప్రబలియున్న అహింసాతత్వము నూతనముగ పుట్టినది కాదు. వెనుకటిశతాబ్దములందు ప్రబలి యున్న భావజాలములను బట్టి ఉత్పత్తియైన తత్వమే. కాలప్రవాహమునందు వర్తమానము, భూతము, భవిష్యత్తు అను మూడు వేరు వేరు శాఖలు ప్రవహించుట లేదు. ఇవన్నియు ఒక ప్రవాహము యొక్క వివిధభాగములే కావున ఇప్పుడు ప్రబలుచున్న భావములను క్రమముగమ ఇది