పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

అమెరికా సంయుక్త రాష్ట్రములు

ప్రాణము స్వతంత్రము సౌఖ్యము పొందు ప్రయత్నము మొదలగునవి. ఈసహజ హక్కులను కాపొడుటకై మానవులు బుద్ధి పూర్వకముగ : ప్రభుత్వముల నేర్పరచుకొని యున్నారు. ప్రభుత్యములు చెలాయించు సధికారములన్నియు పాలితు లిచ్చిన వేగాని పభుత్యములకు స్వంతమగు హక్కు లేమియు లేవు. ఏ ప్రభుత్వమైనను ప్రజల జన్మహక్కులకు వ్యతిరేక ముగ సంచరించినచో దానిని మార్చుటకును నాశనము చేయుటకును క్రొత్త విధమగు ప్రభుత్వమును స్థాపించుకొనుటకును ప్రజలకు సంపూర్ణమగు హక్కుగలదు." . అనుమొదలగు మానవహక్కులను సిద్ధాంతీకరించిరి. ఆంగ్లేయు రాజు వలనరాష్ట్రములమీద జపిన నిరంకుశ చర్యలను ఖండించిరి, " మమాయన సంరక్షణలో లేమని ప్రకటించుట వలనను మామీద యుద్ధము గావించుట వలనను ఆయన మా మీద రాజ్యమును కోల్పోయినాడు, ఆయన మాసముద్ర తీరములను దోచుకొనెను. రేవులను నాశనము చేసెను, మాపట్టణములను తగుల. బెట్టెను. మా ప్రజలను హత్యగా వించెను, మామీద నిరంకుశత్వమును స్థాపించు నుద్దేశముతో విదేశ సైన్యములను మామీదకు బంపి నాగరీకతగల రాజ్యమని తమకుగల పేరునకు వ్యతిరేకముగ మిక్కిలి యనాగరీక మైనట్టియు క్రూర మైనట్టియు ఘాతుక కృత్యములను మాపైసలుపుచున్నాడు తనరాయబారులను బంపి మాలో గృహ కల్లోలములను కుట్రలను చేయించ ప్రయత్నించినాడు. 'మేము పెట్టిన అర్జీలు తోసి వేయబడినవి. రాయ బారములు నిష్పల మైనవి. మాసోదనులగు ఆంగ్లేయ దేశ ప్రజలు ఔదార్యమును