పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ అధ్యాయము

111


{పరాసు వారు
సహాయముచేయుటకు
తీర్మానించుట

బారి పరాను దేశములోని ముఖ్యుల సానుభూతికై ప్రయత్నించుచుండెను. ఇరువది యైదువేల అమెరికను సైనికులకు సరియు యుద్దపరికరములను మందుగుండు సామాగ్రిని దుస్తులను నూరుఫిరంగులను ఇవ్వవలసినదని ఫెంచివారినికోరిరి. ఆమెరికను రాయబారి రాకమునుపే అమెరికనులకు సహాయము చేయు విషయమను గూర్చి పరాసు మంత్రివర్గమువారు యోచించ సాగిరి. ఏప్రిలు 6 వ తేదీన సమావేశమయిరి. ప్రధాన మంత్రి తుర్గోకు పరాను దేశము నెట్టియుద్ధములోను దింపుట కిష్టము లేకుండెను " అమెరికినులు స్వాతంత్ర్యము పొందక తప్పదు. ఈనాడు కానిచో రేపయినను పొందుదురు కాని మన మాంగ్లేయులతో యుద్ధములో ప్రవేశించుట నాకిష్టము లేదు. అని ఆయన చెప్పెను. 'విదేశ వ్యవహారమంత్రి వర్డెన్ ఆమెరికనులకు సహాయము చేయవలెనని పట్టుదలకలిగి యుండెను. అమెరికను లోడిపోయినచో, మానవకోటి యొక్క స్వాతం త్యమునకు గొప్పనష్టము కలుగును, తిరిగి పెట్టి స్వాతంత్రోద్యమముసు తల పెట్టుటకును ఏజాతీయు సాహసించదు. అని ఆయన సుడివెను. మంత్రివర్గములో అధిక సంఖ్యాకులు సహాయముచే యుటకే తీర్మానించిరి. మే నెలలో పరాసు దేశపురాజు తాము పదిలక్షల పరాసు లిపరీలను అమెరికను సహాయార్దము పంప బోవుచున్నామని స్పైన్ రాజునకు తెలియ చేసెను. స్పైన్ రాజుకూడ మరియొక పదిలక్షల లిపరీలను పంపెను.

ఈ మధ్య కాలమున అమెరికను రాష్ట్రములలో నాం.గ్లే