పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

109

ఏడవ అధ్యాయము



కనెక్టికటు రాష్ట్రమునుండి వచ్చిన సైనికులు నిర్నయకాలమూ, రాకముందే గృహములకు వెళ్ళిరి. ఇంకకొన్నిన్ని రాష్ట్రములు వారును గడుపుకాగనే వెళ్ళిరి. కొత్తసైస్యములు కొన్ని వచ్చిచేరెను, కాని తగిన శిక్షణ పొందియుండ లేదు. దేశీయ మహా జన సభ వారు బాస్టను పట్టణము ను మట్టడించవలసినదని వాషింగ్టను కుత్తర విచ్చియుండిరి.. తనవద్దనున్న యుద్ధపరికరములు చాలక, ఆయన సమయమును వేచి యుండెను. మానువ చరిత్రలో నెక్కడనై న వెదుకము. మావఁంటి దీన స్థితి ఎవరికైన కలిగినాయని. పశ్నించుచున్నాను. బలవంతమ యిన ఆంగ్ల సేసలు బాస్టనలోనుండగ ఆఫట్టణము బయట తుపాకి మందు కూడ లేక మే మారు నెలలనుండియు నూరక కాచుకొని యున్నాము. మా సైన్యములలో నొకటి విడి పోవుటయు మరియొక దానిని నూతనముగా తరిబీదు చేసుకొను టయు జరుగుచున్నది. ఈ పరి స్థితిలో ""మే మేమిచేయగలము? గాని యెటులో పరమేశ్వరుడు మాతత్రువుల కన్నలకందకారముగప్పునని మాత్రము త్రికరణ శుద్దిగనమ్ముచున్నాను అని వాషింగ్టను ఒక స్నేహితునికి వ్రాసెను.' గాని ఇట్టికష్ట స్థితిలో గూడ నమెరికా వారు స్వాతంత్ర్య ప్రకటనము గావిం పక తప్పదని ఆయన నిశ్చయించెను.

{వాషింగ్టన్ యొక్క
విజయము}

తుట్టతుదకు మార్చి 4వ తేదీన ఆకస్మికముగా నొకరాత్రి వాషింగ్టను సేనాని బాస్టను పట్టణము నకును దాని సముద్ర రేవునకును ముఖ్యబల మైన డార్చెష్టరు మిట్టప్రదేశమును పట్టుకొని స్వాధీనమును పొంది అక్కడ కందకములు, తవ్వి కోటబురు