పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ అధ్యాయము

101


నిరాకరించి తనకగు ఖర్చులు మాత్రము తీసుకొనుటకొప్పు కొనెను. వాషింగ్టన్ సర్వ నేనాధిపత్యము వహింపకమునుపే బంకరు కొండవద్ద యుద్ధము జరిగెను. ఇది బాస్టను పట్టం మునకు. సమావముననున్న 110 అడుగుల ఎత్తుగల మిట్ట పదేశము - జనరలు గాజు దీని నాక్ర మించి అచట నొక చిన్న కోటను నిర్మింపబోవుచున్నాడను వార్త తెలిసి ప్రెస్కాటు నేనాని నెయ్యిమంది. అమెరికను సైనికులతో వెళ్ళి ముందుగనే నా ప్రదేశమున ప్రవేశించ దలసెను. గాని బంకరు కొండకు మారుగ అమెరికను సైన్యములు పొరబాటున దానికి దక్షిణముననున్న బీడు' కొండ నాశ్రమించెను. ఇదియు సనుకూలమైన ప్రదేశమే. మూడు వేల మంది ఆంగ్ల సైనికు లచటికిపోయి అమెరికను సైన్యములన ముట్టడించిరి. అవుడు జరిగిన యుద్ధములో ఇంగ్లేయులలో నెక్కువ మంది హతులగుట7యు గాయములు పొండుటయూ జరిగెను. గాని ఆ మెరికనుల యుద్ధసామాగ్రులయి పోయినందున (ఎస్కాటు సేవాని భూప్రదేశమును వదలి తన అమెరికను సైన్యములను సురక్షితముగ నొక మైలు దూరముసనుషు ప్రాస్పెక్టు కొండకు చేర్చారు. ఈ యుద్ధము బాస్టసున కు సమీసమున జరిగియుండుటఁబట్టి బాస్టం ప్రజలు గుంపులు గుంపులుగా మిద్దెలమీద నుండియు మేడలమీదనుండియు చూచుచుండిరి. ఆంగ్లేయసై నికులు చార్లెస్టన్ పట్టణము వంతయు తగుల బెట్టి భస్మీపటలము గావించిరి.