పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

అమెరికా సంయుక్త రాష్ట్రములు



దరికన్న అర్హులని పరాసు దేశములోని బుద్ధిమంతులు తలచు చుండిరి. మరియు తమకు శత్రువగు యింగ్లాండులో నమెరి కనులు పోరాడుచున్నందున పరాసు రాచకీయవేత్తల కమెరి కనులయందు సొసుభూతి మరింత హెచ్చినది. ఇంగ్లాండు సందు ద్వేషమును అమెరికనులయందు ప్రేమగౌరవములను ప్రతిపరాసు పౌరుని హృదయమునందును ప్రజ్వరిల్లెను, స్పైన్ దేశపురాజగు మూడవచార్లెసు ఆశాలమున ఫ్రాన్సు రాజుతో స్నేహమును ఇంగ్లాండునం దసూయను గలిగియుండెను. కావున అమెరికా స్వతంత యుద్ధమున పరాసు, స్పైన్, దేశముల ప్రభుత్వములవారమెరికను పశము నవలంభించుటకు సిద్ధముగ నుండిరి. తక్కిన యూరొపు ప్రభుత్వము లన్నియు తటస్త ముగ నుండెను.