పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

ఎంతయో కష్టపడి గ్రంథకర్తలు గ్రంథములు వ్రాయుటయు, ఏమియుకష్టపడని కొందరు వీరి గంధము లకు పీఠికలు వ్రాయుటయు లోకములో ఆచారమైనది. ఇది కేవలము పడమట దేశపు ఆచారము. అక్కడజనులు ఒకరి నొకరు తెలుపుకొనరు. మూటలు కలుపుకొనరు. మధ్యస్థులెవరో వీరిని కలుపవలెను. గ్రంధరచనలోనికికూడ ఈఆచార మే కొంత వరకు పాకినది. ఆ దేశపు ఆచారములన్నిటిని మనము అను కరించుచున్నట్లే దీనినికూడా అనుకరించుచున్నాము. అను కరించుట తప్పు అని ఒప్పుకొనెదము, కాని తప్పు అని తెలిసిన దానినుండి తప్పించుకొనలేక పోవడము రెండవ తప్పు. ఇందులో పీఠిక వ్రాయవలసినదని కాళేశ్వరరావు గారు అడగడము ఆయనది తప్పు. అదితప్పు అని తెలసికూడా నేను వ్రాయుటకు పూసుకొనుట నాదితప్పు. ఈ ఉపోద్ఘాతములో ఏమి వ్రాయ వలెనోకూడా నిర్ణయించుట కష్టము. కాని గ్రంధకర్తను మన ఆంధ్ర దేశముకు ఎరింగించుట ఇటువంటి ఉపోద్ఘాతములలో మొదటి కర్తవ్యము. ఆంధ్ర దేశములో కాళేశ్వరరావుగారిని ఎరుగని వారెవరును ఉండరు, కారా గృహముల కెళ్ళి దేశాభిమానులు గ్రంథములు వ్రాయుచుండగా వెళ్ళనివారు ఉపోద్ఘాతములైనా వ్రాసి తమ కర్తవ్యమును నెరవేర్చవలసియున్నది. అందుచేత జగ మెరిగిన కాళేశ్వర రావుగారికి ఈ జంధ్యపు పోగు వేయవలసి వచ్చినది.

16 వ శతాబ్దమునందు ఆంగ్లేయులంత సోమరిపోతులు