పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరవ అధ్యాయము

91


. లను గావించుటకు పుట్టినవారు కారని ఆయన విమర్శించెను. . ఏబది సంవత్సరములు ఆయన ఫ్రాన్సు దేశముప గొప్పజ్ఞాన జ్యోతియై ప్రకాశించెను. మానవులు పోగొట్టుకొనిన స్వాతం త్ర్యము ను తిరుగ సంపాదించుటకు సతతము కృషిసలిపెను. తన దేశములో రెండు తరముల గారి అభిప్రాయములను భావము లను ఉద్దేశములను పూర్తిగామార్చివేసెను. అమెరికా స్వతఁత యుద్ధమునాటి కీయసకు ఎనుబదిమూడు సంవత్సరముల వయస్సుగలదు. 178వ సంవత్సరమున నీయన పారిసును దర్శించుటకు వచ్చినపుడు ప్రజలీయనకు చూపిన గౌరవమునకు "మేర లేదు. అమెరికా స్వతంత్ర పక్షపు నాయకులలో నొకరగు బెంజమీను ఫ్రాన్కు లీను తన మనుమని వాల్టేరు యొక్క యాశీర్వచనమునకు గోనిపోయెను. ఆపిల్ల వాని శిరమున తన హస్తముంచి " భగవంతుని యనుగ్రహమును, స్వాతం త్యమును పొందుదుపుగాక ! " యని యాజగద్విఖ్యాతపురుషు డాశీర్వదించెను.

ప్రజలలో విప్లన భావములను నిజముగా కలుగ చేసినది రూసో. ఈయన గ్రంధములు మిగుల తీవ్రభావములుగలిగి, యద్రేక పూరితములై ప్రజాసమూహముల హృదయములను పూర్తిగ నాకర్షించెను. ఈయన జాడ్యగ్రస్తుడు, కడుబీదవాడు, అతి స్వతంత్రుడు. ఈయనను 'రాజులును ప్రభువులును అపాయకరమైన వానినిగ నెంచిరి. ప్రజలు విశేషముగ ప్రేమించిరి. మానవులను నాగరికత యనునది నై జధర్మములనుండి దూరముగ చేసి మాలిన్యమును కలుగచేసిన దనియు, నాగరికత యను విషవృక్షమును నరికి వైచి మానవులు స్వచ్చమగు సహజ