పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

అమెరికా సంయుక్త రాష్ట్రములు

త్రలు,తత్వశాస్త్రము, రాజకీయశాస్త్రము, ప్రకృతి శాస్త్రములు, మొదలగు నన్ని విషయములను గూర్చియు, నసంఖ్యాకము లగు గ్రంధములు వ్రాసెను. ఏబదినంవత్సరముల కాలము ఎడ తెగకుండ గ్రంధములు వ్రాయుటచే యూరపు ఖండమునం దంతటను ప్రభువుల చేతను ప్రజల చేతను గౌరవాశ్చర్యములతో 'నీయన గంధములు చదువబడుచుండెను. ఈయన వ్రాసిన గ్రంథములు ఎనుబదితొమ్మిది సంపుటములయ్యెను. పరిపాలన లోను, శాసనములలోను, రాజ్యాంగ విధానములోను, గల లోపములను మిగుల కఠినముగ విమర్శించెను. సాంఘిక దోషములను అనమానత్వమును తీవ్రముగ ఖండించెను. నీతి యుపన్యాసమును వర్దిల్లవ లెననియు, మానవులకు సమాసత్వ మున, స్వాతంత్ర్యమను కావలెననియు ప్రతి గ్రంథము నందును వాసెను. . ప్రభుత్వము చేసెడి అక్రమములను నిర్భయముగ చూపినందుకును, రాజకీయాభిప్రాయములను వెల్లడించినందు సకును శిక్షించుట మిగుల దుర్మార్గమగు అనాగరిక పద్దతియని వాల్టేరు వ్రాసెను. మత స్వేచ్ఛ లేకుండ చేయుట గొప్ప పాప కృత్యమనియు నాయన వ్రాసెను. మానవజన్మము మిగుల ఘనమయినదనియు, కాయకష్టము మిగుల గౌరవమయినదనియు చూపెను. వాక్స్వాతంత్ర్యము, పత్రికా స్వాతంత్ర్యము, మతి స్వేచ్చ- ఈమూడును సంపూర్ణముగ నుండవలెనని కోరెను. ప్రభుత్వములు ను, మతగురువులును ప్రజల స్వేచ్చను "నీతిని వృద్ధి చేయుటకై పుట్టిన వారుగాని, ప్రజల స్వాతం త్యము నణచుటకును, ప్రజలను నిర్బంధించి భయ పెట్టి మనస్సులలోని అభిప్రాయము లకు వ్యతిరేకముగ మాటలాడు కపట వేషధారు