పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

ఆమెరికాసంయుక్త రాష్ట్రములు


{యుద్ధ
ప్రయత్నములు

అమెరికాలో తొందరగా పనులు జరుగుచున్నవి. మెనషుసెట్ను రాష్ట్రమువారు యుద్ధప్రయత్న యుద్ధ ప్రయత్నము చేయసాగిరి. ఆహార సామాగ్రుల ను యుద్ధపరికరములను సమకూర్చసాగిరి. రాబోవు యుద్ధ ములో గాయములు తగిలినవారి చికిత్సకుగాను పరికరములను గూడ తయారు చేసిరి. ఏబది వేల సవరనుల రుణమును , ప్రజల నుండి వసూలుచేసిరి. 1775 సంవత్సరం ఫిబ్రవరి 27 వ తేదీసనీ మొదటికలహము జరిగెడిది. కాని ఆకస్మికముగా తప్పిపోయెను. ఉనీలమను ప్రదేశములో యుద్ధసామాగ్రు లొక యింటియం దుంచబడెను. ఆంగ్లేయ సేనాధిపతి జనరలు గేజు వాటిని స్వాధీనపర్చుకొమ్మని వెస్లీ సేవానినుండి నలుబది మంది సెనికులను బంపెను. కాని వారు రాక ముందే , పజలీ సామాగ్రుల నచటనుంచి తీసి మరియొక చోట దాచిరి. ఈ దాచిన స్థలమునకు 'వెళ్ళవలెనని 'వెస్లీ సేనాని యత్నించెను. గాని మార్గముననున్న వంతెనలను ప్రజ లేత్తి వేసిరి. సైనిక లలో కూడ పడవల మీదనదిని దాట ప్రయత్నించిరి. అవ తలయొద్దున ప్రజలు గొడ్డళ్ళతో వేచియుండి వొడ్డుకొచ్చెడి పడవలను ముక్కలు ముక్కలుగ నరికివేయుచుండిరి. అప్పు డొక రాజీనామా కుదిరి ఆ సేనలను ప్రజలు నదిని దాటనిచ్చిరి.సేవలు యుద్ధ సామాగ్రులను స్వాధీనపర్చు కొనకుండ వెళ్ళి పోయిరి 1775 సంవత్సరం మార్చి 26 వ తేదీన వర్జీనియాలో నొక సమావేశము జరిగి యారాష్ట్రమును సంరక్షించుకొను