పుట:Ambati Venkanna Patalu -2015.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రత్యేకమైన గొంతుకతో వచ్చిన

కవి పాటగాడు అంబటి

తెలుగు పాటకు, తెలంగాణ ఉద్యమ

బాటకు నిలువెత్తు సంతకం

అన్న గోరటి వెంకన్న మదిలో నేను...

పాటలో కవిత్వీకరణ, వస్తు వైవిధ్యం, ప్రత్యేకమైన శైలి కలిగి తెలుగు సాహిత్యంలోకి ఒక ప్రత్యేకమైన గొంతుకతో వచ్చిన కవి, పాటగాడు వెంకన్న. ముఖ్యంగ వెంకన్న రచనల్లో ఎవరి అనుకరణలు లేవు. ఎందుకంటే పాటనేది ఒక ప్రభంజనం వెంకట్‌లో ఉన్న గొప్పతనం ఏందంటే తన స్వంత ముద్రతోని అధ్భుతమైన ఎత్తుగడతో పాటు పాటకు అనుగుణంగా ఉంటూనే వచన కవిత్వం యొక్క మేళవింపు ఉన్నది శైలి ఉన్నది, అన్నింటికి విస్తృతి ఉన్నది.

అంబటి వెంకన్నలో ఉన్న మరొ ప్రధానమైన అంశం ఏందంటే ఒకే విషయం దగ్గరో, ఒకే వస్తువు దగ్గరో ఉండకుండ ప్రపంచీకరణ మొదలుకొని, వృత్తులు మొదలుకొని, తెలంగాణ ఉద్యమం మొదలుకొని, అనేక సామాజిక అంశాల మీద తను రాసిన పాటలో వస్తు విస్తృతి ఉంది. దీంతో పాటు శిల్పపరిణతి ఉంది. ఈ రెండింటిని పాటలో సాధించిన అతికొద్ది మంది రచయితల్లో వెంకన్న ఒకడు.

బహుజనులు, బీసీల జీవితాన్ని పట్టుకొని పాటలోకి ఒంపిన వెంకన్నకు పాటకవుల్లో మొదటిస్థానం ఇవ్వవచ్చు. గౌడ్‌ల జీవనవిధానాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన కల్లుపాట గాని, బెస్తకులవృత్తి మీద రాసిన పాటలు గాని, బీసి జీవితాలకు సంబంధించిన అంశాలు గాని ప్రతిది ఏ పాటకు ఆ పాట దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది.

ఒక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కోణమే కాకుండ గొప్ప బతుకును, పల్లె జీవితాన్ని ఒడిసి పట్టుకున్న వెంకన్నకు జయహో...

- గోరటి వెంకన్న

ప్రముఖ కవి గాయకులు

హైద్రాబాద్

తేది: 02-02-2015

403

అంబటి వెంకన్న పాటలు