పుట:Aliya Rama Rayalu.pdf/99

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఫెరిస్తా యళియరామరాయలు యుద్ధమే చేయలే దనియు, సలకముతిమ్మయను మోసపుచ్చగా నతడు పిచ్చబట్టి రాజధనాగారమంతయు గొల్లపెట్టి నాశనముగావించి విద్యానగరము నంతయు వైభవశూన్యముగాజేసి తుదకు విశ్వాసానర్హమై భయంకరమైన యాత్మహత్యజేసికొని చచ్చెనని వ్రాసినదానిని 'హిరాసుఫాదిరి' వంటివిదేశీయుడైన చరిత్రకారుడు విశ్వసించినను దేశీలయిన చరిత్రకారు లెవ్వరును విశ్వసింప జాలరు. తెలుగుగ్రంథములలో నళియరామరాయలు యుద్ధమున సలకముతిమ్మయను సంహరించినవా డనిచెప్పినమాత్రముచేత నాతడు స్వహస్తములతో జంపినవాడని భావింప నక్కరలేదు. ఆతనిపక్షమున నెవ్వనిచే జంపబడినను యుద్ధములో జంపె బడెననుట సత్యమని సందేహింప బనిలేదు.

'కోయుటో' తానువ్రాసిన చరిత్రమునందు 'సలకముచిన్నతిమ్మరాజు తనప్రజలచే జంపబడినవా' డని వ్రాసియున్నాడనియు, మీర్జాఇబ్రహీముజబిరి యనునాతడు తానువ్రాసిన 'బసాతిన్ - ఉస్ - సలాతిన్‌' అనుచరిత్రమున సలకముచిన్నతిమ్మరాజు యుద్ధములోనే చంపబడినట్టు వ్రాసియున్నా డనియు, హీరాసుఫాదిరి తనయారవీటివంశ చరిత్రమునందు బేర్కొనియుండియు వీనినెల్లను విస్మరించి యొక్కఫెరిస్తా వ్రాతలనే యేల విశ్వసింపవలసివచ్చెనో దురూహ్యముగా నున్నది.[1]

  1. The Aravidu Dynasty of Vijianagar p. 11, F.N. No. 2. Couto O. C. p. 382; F. N. No. 5 Busatin - us - Salatin. p. 52.