పుట:Aliya Rama Rayalu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యవుండేపూర్వోత్తరము, వాడుయక్కడవుండేది, ఫౌజువుండేరీతి ముందరయేతట్టుసాగివచ్చేసంగతి తెలుసుకొని వచ్చేవారు యెవ్వరు చాతమీతహకీకు వర్తమానం వచ్చేటందుకు చోరు హరకార్లనుపంపించుమనగా అప్పుడు మెసాపెద్దనాయడు ముందుపడి తహకీకు ఖబురు నేను తెప్పిస్తున్నానని తాంబూలంతీసుకొని సలకయతిమ్మయఫౌజులోనికి అంపతగినవారిని పంపించి నిజమానం వర్తమానం తెప్పించి యావత్ఫౌజును వెంటదీసికొని ఘండికోటవారు సొన్నలాపురం హండేహనుమప్ప నాయడు మెసాపెద్దప్పనాయడు తనజమియ్యతుతో ఫౌజు నడిపించి రాతో రాతు ఆదవానికి వచ్చి వుత్తరభాగం తుంగభద్రాతీరమందు సలకంతిమ్మనిఫౌజుమీద చప్పాబడి నరికి హతాహతం చేసినందున హతశేషులయిన ఫౌజుతో సలకయతిమ్మడు పారిపోతూయుండగా పెమ్మసానివారు హండేవారు, మెసావారు యీముగ్గురు ఖాసాగుఱ్ఱాలు వేసికొని పోయి సలకయతిమ్మణ్ణి శిరచ్ఛేదనం చేసి ఝాండాకుకట్టి.........."

ఈరీతిగా నాంధ్రగ్రంథములయందును స్థానికచరిత్రములయందును అళియరామరాయలు సకలకర్ణాటసామ్రాజ్య సముద్ధరణోద్యోగియై, సామ్రాజ్యద్రోహిగ బ్రవర్తించిన సలకముచినతిమ్మరాజును బ్రతిఘటించి యుద్ధము చేసి వానినాశనము గావించి కృష్ణదేవరాయలసోదరపుత్త్రు డయినసదాశివదేవరాయలను బట్టాభిషిక్తుని గావించి మహోన్నత ప్రతిష్టాప్రతిభల గాంచినవా డనిదెలుపుచుండ మహమ్మదుఖాసిం