పుట:Aliya Rama Rayalu.pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మెసాపెద్దానాయడు, పెమ్మసానియెఱ్ఱతిమ్మానాయడు, హండే హనుమప్పనాయడు తోడ్పడినట్లు నడిమిదొడ్డిపాలెగాండ్లకయఫియత్తునందును వివరింపబడియుండెను.[1]

ఈకడపటికయఫియతులోవివరము లెంతమనోహరములుగా వ్రాయబడినవో చదువరులు తెలిసికొనుటకై యాభాగ మిచట నుదాహరించెదను.

"అళియరామరాయణ్ణి కొట్టివేయవలె నని విజయనగరానకు కూచుదరకూచువేయించి ఫౌజుతో వస్తువుండగా యీ వర్తమానం అళియరామరాయలు వినిమొహరుతీసుకొనిరాతో రాతువచ్చి పెనుగొండకు దాఖలుఅయి అక్కడనుండి పెమ్మసానితిమ్మానాయణ్ణి, హండేవారిని, మెసాపెద్దనాయణ్ణి ఇంకాజహగీరుదార్లకు శిఖాపత్రాలుపంపించి మీమీయావత్ఫౌజులతోకూడా యెకాయెకీవచ్చే దనివ్రాయించి వున్నందున అదేప్రకారముగా సకలమైనవారితో కూడా మెసాపెద్దప్పనాయడు పోయినంతలోగా రామరాయలవారు సలకయతిమ్మని దుర్మార్గాలు అందరికి చెప్పి తరతరాలనుంచీ మీరుస్వామికార్యములో బహుశా మెహన్నతుచేసి కష్టపడి సకలబహుమానాలు బిరుదులు సంపాదించు కొన్నారు. ఇపుడున్న యీకార్యం నిర్వాహకంచేసి శత్రుఖండనచేస్తిరా యనా మీకు విశేషించి బిరుదులు బహుమానాలు యిప్పిస్తున్నా మనిచెప్పి సలకయతిమ్మ

  1. Sources of Vijianagar, p. 179 - 180; Local Records, Vol 12, p. 213, L. R. Vol. 39. p. 16.