పుట:Aliya Rama Rayalu.pdf/95

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

'రామరాజీయ' మనునామాంతరము గలనరపతివిజయ మను గ్రంథమున,

          "సలకవిభుతిమ్మరాజుసేనలను ద్రుంచి
           గుత్తి, పెనుగొండ, మఱిగండికోటకంద
           నోలుపుర మాదవే నవలీల గెలిచి
           తొలుదొలుత రామనృపతి దోర్బలము మెరసె."

అనిస్పష్టముగావివరించివ్రాసినవాడు. అళియరామరాయలకు బ్రత్యర్థిగానుండి విజయనగరంబున నీమహాభయంకరమైన విప్లవమును గల్గించి సంక్షోభపెట్టిన 'సలకముతిమ్మయ' అచ్యుతదేవరాయల మరదులిర్వురలోను రెండవవా డయిన చినతిమ్మరాజుగాని "విజయనగరచరిత్రమునకుమూల ప్రమాణము" లను గ్రంథములో పీఠికాకారులు వారియుపోద్ఘాతములో దెలిపి నట్లుపెదతిమ్మరాజుగాడు రంగపరాజవిరచితమైనసాంబోపాఖ్యాన పీఠికలో నళియరామరాయలకు బ్రతిస్పర్థిగ నుండి వ్యవహరించి సంహరింపబడినవాడు సలకముచినతిమ్మరా జనియె స్పష్టముగా దెలుపబడినది.[1]

  1. Finding himself unequal to the three brothers, the elder Tirumala, Who is discribed as a madman invited his Mahammadan neighbours to his assistance. According to the annals of Hande Anantapuram the three brothers over powered the madman first and killed him, and marched forward to meet the allied SulTans of Ahmadnagar, Bedar, and Golkonda. Having defeated them in the field the brothers returned to headquarters and installed Sadasiva duly as the emperor. (sources of vijianagara History by Ranganadha Saraswati and edited by Dr. L. Krishnaswami Aiyagar Intriduction. page, 15.)

            "మ. మహినెవ్వారెనసల్కరాజచినతిమ్మక్ష్మాపకంఠారుణాం
                 బుహవిశ్చర్యణతర్పితాసిశిఖికింబుష్పాయుధస్నిగ్ధని
                 గ్రహసౌభాగ్యపరంపరాపరిధికింగర్ణాటకైశ్వర్యని
                 ర్వహణావార్యభుజద్వయాయుఢపరీవారుండు రామప్పకున్."