పుట:Aliya Rama Rayalu.pdf/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


          "సీ. పట్టాభిషేకవిపర్యయంబున బ్రోలు
                    వెడలి ప్రియానుజ ల్వెంట గొలువ
              జిత్రకూటాభిఖ్య జెలగు పెన్గొండ సా
                    ద్రహరిద్విపేంద్ర నాదవని జేరి,
              ఖలజనస్థానవాసుల బల్వుర వధించి
                    మహిమసలకఖరస్మయ మడంచి,
              హరివీరభటమహోద్ధతినబ్ధి గంపింప
                    దురమున గదిసి తద్ద్రోహి దునిమి,

              యనఘతరపార్థివేందిర నధిగమించి
              సాధుకర్ణాటవిభవసంస్థాపనంబు
              పూని శరణాగతుల నెల్ల బ్రోచె రాము
              డతడు నిజచరితంబు రామాయణముగ."
                                (వసుచరిత్రము)

పయిపద్యములలో వివరించినరీతినిబట్టి యళియరామరాయలు సలకముతిమ్మయ సైన్యములతో బోరాడి యుద్ధములో నాతని సంహరించి సకలకర్ణాటరాజ్యము సుస్థిరముగా నిలుచు నట్లుచేసి శరణాగతుల నెల్లరను రక్షించి ప్రోచి కీర్తిగాంచె ననిబట్టుమూర్తి (రామరాజభూషణకవి) స్పష్టముగా దెలుపుచున్నాడు. ఇంతియగాదు; సలకముతిమ్మయకు దోడ్పడవచ్చిన నిజాముషాహ, కుతుబ్షాహ, ఏదిల్‌షాహ తమ తమసైన్యములతో, బలాయనులై యడవులకు బారిపోవ