పుట:Aliya Rama Rayalu.pdf/91

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యున్నాడు. కృష్ణదేవరాయలకాలమున బరీదుషాహాతో యుద్ధము జరుగలేదు. అదియునుంగాక ఆదిల్ షాహాకు బరీదుషాహాకు మైత్రియున్నట్టు తోచదు. మఱియు నచ్యుతరాయలకాలమున గూడ బరీదుషాహాకు విజయనగరసామ్రాజ్యముతో యుద్ధముపొసగి యుండలేదు. కనుకకూరకచెర్లకడ నప్పలరాజునకు నాదిల్‌షాహాబరీదుషాహలకు జరిగినయుద్ధము 1542 లో పైసుల్తానులు సలకముతిమ్మయపక్షము నవలంబించి వచ్చినప్పుడే జరిగియుండు ననియు, ఆయుద్ధముననే యౌకు తిమ్మరాజుకుమారు డప్పలరాజుమరణించినవాడనినిశ్చయింప వచ్చును. అప్పలరాజుతండ్రియగు నౌకుతిమ్మరాజునుగూర్చి వ్రాయునపుడుద్విపదబాలభాగవతమునందు,

         "కడిమిమై మానునకడ రణక్షోణి
          గడుసరి నేదులఖాను జయించె"ననియు,

పద్యబాలభాగవతమునందు:-

         "మానునకడ సవాబూని పోరను బరా
          జయము నొందించె నేశౌర్యశాలి"

అనియు వ్రాసియుండుటచేత సలకముతిమ్మయపక్షము వహించి వచ్చినవిజాపుర సుల్తానాదులతో నళియరామరాయల పక్షమువారు యుద్ధము చేసియోడించినారని యీబాలభాగవతములలో బేర్కొనబడినవిషయములే వేనోళ్ల జాటుచున్నది.