పుట:Aliya Rama Rayalu.pdf/90

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యళియరామరాయలకు దోడ్పడినట్లుగా పద్యబాలభాగవతమునందలి యీక్రింది పద్యమువలన విదితము కాగలదు.

పద్యబాలభాగవతము:-

          "సలకముతిమ్మాసురదు
           ర్విలసితవిలయాబ్ధిలగనవిహ్వలవసుధా
           వలయస్థితికృతివివృతో
           జ్వలతరధరణీవరాహవరబిరుదాంకా!"

మఱియు నింకొకవిషయమునుగూడ బేర్కొని యున్న వాడు. ఈయారవీటి చినతిమ్మరాజునకు సవతియన్న యగు అప్పలరా జనునాతండు (అనగా ఔకుతిమ్మరాజునకు మఱియొక భార్యవలన బుట్టినవాడు) కూరకచెర్లయొద్ద సవాబరీదుల యుద్ధములో జయించియు మృతినొందినటులగూడ ద్విపదబాలభాగవతములోని యీక్రిందిద్విపదలవలన దెలియుచున్నది. చూడుడు.

           "అమితవైభవుడైన యప్పలరాజు
            రమణీయమైనకూరకచేర్లయొద్ద
            కడుమించు సాజిరంగంబున గడిమి
            దొడరినసవాబరీదుల నిర్జయించి
            తరణిమండలవిభేదనపూర్వకముగ
            సురలోకములకు రాజులు మెచ్చ నరిగె."

అప్పలరాజు కూరకచెర్లకడ ఆదిల్‌షాహా, బరీదుషాహాలతో జరిగినయుద్ధమున జయముపొందియు మరణించె ననివ్రాసి