పుట:Aliya Rama Rayalu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని తనతోడిరాజులును ప్రజలును జయఘోషసలుపుచుండ చంద్రగిరిమొదలుగా ముఖ్యదుర్గములను కోపముతో స్వాధీనపఱచు కొన్నట్టు వ్రాయబడి యున్నది. అనాదిగా చంద్రగిరిదుర్గమును, తద్రాజ్యమును విజయనగరసామ్రాజ్య ప్రభుత్వమునకు వశములై యున్నవి. అచ్యుత దేవరాయని కాలమున చంద్రగిరిదుర్గమును, రాజ్యమును విజయనగరసింహానమును ప్రతిఘటించి యుండ లేదు. చిన్నవేంకటాద్రి మరణానంతరము సలకముతిమ్మయ పక్షముననుండ నతనిప్రతిస్పర్థి యైనయళియ రామరాయల పెదతండ్రికుమారు డైన యీయారవీటి చినతిమ్మరాజు రామరాయలపక్షమున నుండి సలకముతిమ్మయపక్షమువారితో బోరాడి గైకొని, యళియరామరాయనిచే బట్టాభిషిక్తుడుగా గావింపబడిన సదాశివదేవరాయలరాజ్య ప్రారంభకాల మనగానా 1542 వ సంవత్సరము నుండియు జంద్రగిరి రాజ్యమునకు బ్రభువుగా నుండెనని నిర్ధారణము సేయవచ్చును. కావున నారవీటి చినతిమ్మరాజు చంద్రగిరిదుర్గమును వశ్యపఱచుకొన్నవా డన తప్పక సలకముతిమ్మరాజు పక్షమువారితో బోరాడి గెల్చుకొన్నవా డనిచెప్పవలయునేగాని మఱియొకవిధముగా జెప్పుటకు సాధ్యముగాదు. ఈయారవీటి చినతిమ్మరాజు తండ్రియగు నౌకుతిమ్మరాజు గూడ సలకముతిమ్మయగావించిన యీ మహావిప్లవము నడంచుటయందు దనతమ్మునికుమారుడయిన